The Freelancer Review: ప్రేక్షకులను కనురెప్ప వాల్చనీయని వెబ్ సిరీస్
ద ప్రీలాన్సర్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. సిరియాలో చిక్కుకున్న యువతిని తిరిగి భారత్ తీసుకొచ్చే కథాంశంతో సిరీస్ తెరకెక్కించారు.
వెబ్ సిరీస్ :ద ప్రీలాన్సర్ నటీనటులు: మోహిత్ రైనా, సుశాంత్ సింగ్, అనుపమ్ ఖేర్, కశ్మీర పరదేశి, అయేషా రజా మిశ్రా, నవనీత్ మాలిక్ తదితరులు రచన: రితేశ్ షా, బెనజీర్ అలీ ఫిదా క్రియేటర్: నీరజ్ పాండే దర్శకత్వం: భావ్ ధూలియా విడుదల:సెప్టెంబర్ 1వ తేదీ ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రన్ టైమ్:4 ఎపిసోడ్స్ (3.30 గంటలు)
The Freelancer web series: ద ఫ్రీలాన్సర్ (The Freelancer web series) వెబ్ సిరీస్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ రోజు నుంచి స్ట్రీమ్ అవుతోంది. మహిళల ట్రాఫికింగ్ నేపథ్యంలో తీసిన సిరీస్ ఆకట్టుకుంటుంది. మరో కేరళ స్టోరీని తలపిస్తోందని ఫిల్మ్ క్రిటిక్స్ అంటున్నారు. వెబ్ సిరీస్‌కు ఐఎండీబీ కూడా 9.5 రేటింగ్ ఇచ్చింది.
కథ ఏంటంటే..?
ముంబైకి చెందిన యువతి అలియా సిరియాలో చిక్కుకుంటుంది. ఐఎస్ తీవ్రవాదుల వల్ల ఇబ్బందులు పడుతుంది. అక్కడి నుంచి ఆమెను ఎలా రక్షించారన్నదే కథాంశం. అలియా భర్తే ఆమెకు సర్ ప్రైజ్ ఇస్తానని సిరియా తీసుకెళతాడు. మంచివాడిలా నటించి, మోసం చేస్తాడు. శిరీష్ థోరట్ పుస్తకం.. ఏ టికెట్ టు సిరియా ఆధారంగా వెబ్ సిరీస్ తెరకెక్కించారు.
ఎలా ఉందంటే..?
నీరజ్ పాండే క్రియేట్ చేసిన స్టోరీ అద్భుతంగా వచ్చింది. ఆ సిరీస్‌ను భావ్ ధులియా చక్కగా తెరకెక్కించారు. కేరళ స్టోరీ అప్ డేట్ వర్షన్‌గా ద ప్రీలాన్సర్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. యువత ఐఎస్‌కు ఎందుకు ప్రభావితం అవుతున్నారనే అంశంపై డాక్టర్ ఆరిఫ్ ఖాన్ (అనుపమ్ ఖేర్) పాత్ర ఉంటుంది. వారిని ఐఎస్ చెర నుంచి విడిపించేందుకు అవినాష్ కామత్ (మోహిత్ రైనా) రంగంలోకి దిగుతారు. సిరియాలో చెరలో చిక్కుకున్న అలియాను కాపాడేందుకు అవినాష్ పోరాటం చేస్తాడు. అవినాష్ స్నేహితుడు ఇనాయత్ ఖాన్ (సుశాంత్ సింగ్) కూతురే అలియా, ఆమెను సిరియా నుంచి తీసుకొస్తానని అవినాష్ హామీ ఇస్తాడు. అలియా భర్త మోసిన్ మంచివాడిగా నటిస్తాడు. అలా మెల్లిగా సిరియా తీసుకెళ్తాడు. ఫోన్ కూడా దాచిపెడతాడు. కానీ ఎలా గోలా మొబైల్ తీసుకుని.. మోసిన్ గురించి వివరిస్తోంది. దీంతో అలియా జాడ గురించి తెలిసి.. అవినాష్‌కు విషయాన్ని అయేషా రజా మిశ్రా (అలియా తల్లి) చేరవేస్తోంది. తాను ఎక్కడ ఉన్నాననే విషయాన్ని ప్రతీ క్షణం అలియా- అవినాష్‌కు చెబుతోంది.
ఎవరెలా చేశారంటే..?
సిరీస్‌లో అవినాష్ కామత్ గత జీవితం గురించి ప్రస్తావిస్తారు. అతని భార్య మంజరి మానసిక రోగి. అలాగే ముంబైలో ఐసిస్ రిక్రూట్ మెంట్ చేసిన బాలాజీ గౌరీ పాత్ర కూడా భయంకరంగా ఉంది. ఐసిస్ చెరలో ఉన్న అలియాను రక్షించేందుకు అవినాష్ కామత్ సాహసమే చేస్తాడు. ఆమెను కాపాడేందుకు ప్రతీ చిన్న సాయాన్ని కూడా ఉపయోగించుకుంటారు. ప్రీ లాన్సర్ వెబ్ సిరీస్ థ్రిల్లింగ్‌గా ఉంది. ఇస్లామిక్ టెర్రరిజం అనేది నేపథ్యంలో.. ప్రతీ క్షణం ఉత్కంఠగా సాగుతుంది.
ఫైనల్‌గా
ద ప్రీలాన్సర్ వెబ్ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రతీ ఫ్రేములో మోహిత్ రైనా కనిపిస్తారు. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఓ భారతీయ యువతిని కాపాడేందుకు చేసే సాహస దృశ్యాలు కట్టి పడేస్తాయి. సుశాంత్ సింగ్, అలియా తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్
కథ, కథనం
దర్శకత్వం
నిర్మాణ విలువల
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్