»Petrol Diesel Rates Increase More Than 300 Protests In Many Places In Pakistan
Petrol rates increase: రూ.300 దాటిన పెట్రోల్..పలుచోట్ల నిరసనలు
మొన్న టమాలు.. తర్వాత ఉల్లిగడ్డలు.. ఇప్పుడు పెట్రోలియం(petrol), డీజిల్ ధరలు(diesel price) భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.305కు చేరింది. అయితే ఈ రేట్లు మన పక్క దేశమైన పాకిస్తాన్లో కొనసాగుతున్నాయి.
Petrol diesel rates increase more than 300 Protests in many places in pakistan
ఇప్పటికే అత్యధిక కరెంట్ బిల్లులతో పాకిస్తాన్(pakistan) ప్రజలు ఇబ్బంది పడుతుండగా..అక్కడి ప్రభుత్వం గురువారం అర్థరాత్రి పెట్రోల్, డీజిల్ ధరలను 14 రూపాయలకుపైగా పెంచింది. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్(petrol) ధర రూ.305.36, ఉండగా హైస్పీడ్ డీజిల్ ధర(diesel price) రూ.311.84కు చేరుకుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధరల పెరుగుదల, మారకపు ధరల వ్యత్యాసాల కారణంగా పెంచినట్లు అక్కడి ఆర్థిక విభాగం అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్ కరెన్సీ విలువ రోజురోజుకు పడిపోతున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను పెంచింది. ఇప్పటికే దిగుమతి పరిమితుల సడలింపు తర్వాత కరెన్సీ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది.
మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) 3 బిలియన్ డాలర్ల స్టాండ్బై ఏర్పాటు కోసం చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అక్కడి మార్కెట్లో రూపాయి రూ.15కు పైగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో నవంబరులోగా జరగబోయే జాతీయ ఎన్నికలకు చాలా ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్ చరిత్రలో ఈ రేంజ్ లో రేట్లు పెరగడం ఇదే మొదటిసారి అని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే విద్యుత్ రేట్లు పెంచిన నేపథ్యంలో పలుచోట్ల స్థానికులు నిరసనలు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఇంధన ధరలు పెంచడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.