6.4 Million వీడియోలు తొలగించిన యూట్యూబ్.. ఎందుకంటే..?
తప్పుడు సమాచారం ఇచ్చే యూట్యూబర్లపై కంపెనీ చర్యలు తీసుకుంది. ఆ వీడియోలను ప్లాట్ పామ్ మీద నుంచి తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా 64 లక్షల వీడియోలను రీమూవ్ చేసింది.
Youtube Removed Videos: యూట్యూబ్ (Youtube).. బిగినర్స్‌కి మంచి ఫ్లాట్ పామ్.. ఏదైనా మంచి సబ్జెక్ట్ తీసుకొని,, మంచి క్వాలిటీ, వాయిస్ కూడా కరెక్ట్‌గా ఉంటే చాలు.. వీడియో రీచ్ ఎక్కువ వస్తోంది. దీంతో యూట్యూబర్లకు (Youtube) ఆదాయం వస్తోంది. కరోనా తర్వాత యూట్యూబ్ రెవెన్యూ గణనీయంగా పెరిగింది. మొబైల్ వాడకం పెరగడం.. కామెడీ, డోరోమాన్ లాంటివి పిల్లలు చూస్తుండగా.. మహిళలు.. వంటింటి చిట్కాలు, వంటలు, కుట్లు, అల్లికలు.. తదితర వీడియోలు చూస్తుంటారు.
యూట్యూబ్ (Youtube) మీదకు చాలా మంది రావడం.. ట్రాఫిక్ పెరగడంతో కమ్యూనిటీ గైడ్ లైన్స్ కూడా స్ట్రిక్ట్ చేశారు. ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారం ఉంటే చాలు నిర్దాక్ష్యిణంగా వీడియోను తీసి వేస్తున్నారు. అంతకుముందే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇచ్చారు. అయినప్పటికీ కొందరు మారలేదు. సో.. అదీ తింటే మంచిది, రోగం నయం అవుతుందని.. సొంతంగా చేసిన వీడియోలను డిలేట్ చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా 6.4 మిలియన్లు. .అంటే 64 లక్షల వీడియోలను (video) తీసి వేసింది.
ఈ జనవరి నుంచి మార్చి వరకు డేటా తీసుకొని డిలేట్ చేసింది. తీసివేసిన వీడియోల్లో (video) భారత దేశం నుంచి 19 లక్షలు ఉన్నాయి. అమెరికాకు చెందిన వీడియోలు 6.54 లక్షలు, రష్యా 4.91 లక్షలు, బ్రెజిల్ 4.49 లక్షల వీడియోలు ఉన్నాయి. తప్పుడు సమాచారం ఇస్తే.. కనికరం లేకుండా వీడియోలను డిలేట్ చేసింది. దీంతో అప్పటివరకు ఆ చానెల్‌కు ఉన్న రెప్యుటేషన్ పోతుంది. అలాగే మిగతా వీడియోలు అంతగా జనంలోకి వెళ్లవు.