»Supreme Court Fake Website Cji D Y Chandrachud Said To Be Vigilant From Cyber Criminals
Fake Website: కేటుగాళ్ల ఐడియాలతో జాగ్రత్త..సుప్రీంకోర్టు ఫేక్ వెబ్ సైట్
వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడంలో సైబర్ నేరగాళ్లు మరో భారీ మోసానికి తెరలేపారు. ఏకంగా సుప్రీంకోర్టు ఫేక్ వెబ్సైట్ను క్రియేట్ చేశారు. ఈ విషయంపై ఏకంగా చీఫ్ జస్టీస్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.
Supreme Court Fake Website. CJI D Y Chandrachud said to be vigilant from cyber criminals.
Fake Website: ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడంలో సైబర్ నేరగాళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అనేక సంస్థలు, వ్యక్తులు, బ్రాండ్ల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగలిస్తున్నారు. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు(Supreme Court)’ పేరితో ఓ నకిలీ వెబ్సైట్ (Fake Website) రూపొందించారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయాన్ని స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ (CJI Justice D Y Chandrachud) తెలిపారు. ఈ వెబ్సైట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని లాయర్లు హెచ్చరించారు. దీనిపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ (SC Registry) పబ్లిక్ నోటీసు విడుదల చేసింది.
నేరగాళ్లు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా (Supreme Court of India)పేరుతో ఓ నకిలీ వెబ్సైట్ను క్రియేట్ చేశారు. దీనికి సంబంధించి రెండు URLల్లను కూడా జనరేట్ చేశారు. వీటి ద్వారా వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. అయితే ఈ యూఆర్ఎల్లను ఎవరికి షేర్ చేయొద్దని, అలాగే అందులో ఎలాంటి రహస్య సమాచారాన్ని పంచుకోవద్దని తెలిపారు. సుప్రీంకోర్టు ఎప్పుడు ప్రజల వ్యక్తిగత వివరాలను, లావాదేవీలను అడగదు అని వెల్లడించారు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా www.sci.gov.in డొమైన్తో రిజిస్టర్ అయి ఉంది. ఈ కోర్టు పేరుతో ఏదైనా యూఆర్ఎల్ వస్తే దాన్ని క్లిక్ చేసే ముందు ఒరిజినల్ డొమైన్తో సరిచూసుకోవాలని పేర్కొన్నారు. ఒకవేళ సైబర్ దాడికి గురైతే వెంటనే మీ అన్ని ఆన్లైన్ ఖాతాలు, బ్యాంక్ అకౌంట్ల పాస్వర్డ్లను మార్చుకోండి అని రిజిస్ట్రీ సూచించింది. ఈ నకిలీ వెబ్సైట్ ను కట్టడి చేసే చర్యలు ప్రారంభించామని తెలిపింది. ఈ నకిలీ వెబ్సైట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని నమ్మి ఎలాంటి లావాదేవీలకు పాల్పడొద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సూచించారు.
చదవండి:Viral: రాఖీ సందర్భంగా సోదరుడికి కిడ్నీ డొనేట్ చేసిన సోదరి..!