»Viral Two Women Who Tortured And Killed A Parrot Shocked By The Courts Verdict
Viral: చిలుకను చిత్రహింసలు పెట్టి చంపిన ఇద్దరు మహిళలు..కోర్టు తీర్పుకు షాక్
ఓ ఇద్దరు మహిళలు తాము పెంచుకునే చిలుకను చిత్రహింసలు పెట్టి చంపారు. ముద్దుగా మాట్లాడే ఆ చిలుకను అత్యంత పాశవికంగా హతమార్చారు. దీంతో కోర్టు వారికి జైలు శిక్ష విధించింది.
చిలుకలు అంటే అందరికీ ఇష్టమే. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. కొందరు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. కానీ ఇక్కడొక ఇద్దరు మహిళలు తాము పెంచుకునే చిలుకను చిత్రహింసలు పెట్టిమరీ చంపారు. అత్యంత పాశవికంగా ఆ చిలుకను చంపారు. వారు చేసిన నేరానికి ఆ ఇద్దరు మహిళలకు కోర్టు జైలుశిక్ష విధించింది. ఈ ఘటన ఇంగ్లండ్ (England)లో చోటుచేసుకుంది. కార్లిస్లే క్రౌన్ కోర్ట్(Carlisle crown court) ఈ తీర్పునిచ్చింది.
ఇంగ్లాండు(England)లో ట్రేసి డిక్సన్ (Tracy Dixon) అనే 47 ఏళ్ల మహిళ, నికోలా బ్రాడ్లే(Nicola Bradley)అనే 35 ఏళ్ల మహిళ కలిసి ఆఫ్రియన్ గ్రే (african grey parrot) రకానికి చెందిన పెంపుడు చిలకను చంపారు. పీలక దాకా మద్యం తాగి అత్యంత పాశవికంగా చిలుకకు చిత్రహింసలు పెట్టి మరీ చంపేశారు. ఆ చిలుకను వారు ముద్దుగా స్పార్కీ అనే పేరుతో పిలుస్తారు. మాటలు నేర్చిన ఆ చిలుక చక్కగా పాటలు పాడేది. ముద్దు ముద్దుగా మాట్లాడేది. ఎవ్వరు మాట్లాడినా వారి మాటలకు బదులు చెప్పేది.
ఓ రోజు మద్యం మత్తులో ఉన్న ఆ మహిళలు ఈ చిలుక దగ్గరకెళ్లి చిలుకపై ఓవెన్ క్లీనర్ స్ప్రే చేశారు. అంతేకాదు చిలుకను గ్లాస్ పెయింట్‌లో ముంచారు. ఆ తర్వాత మెడ విరిచి, వాషింగ్ మిషన్‌లోని డ్రయర్ లో పడేసి దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. అక్కడితో ఊరుకోకుండా మిషన్ లోంచి బయటకు తీసి పెంపుడు కుక్కకు తినిపించడానికి ప్రయత్నం చేశారు. అప్పటికే ఆ చిలుక చనిపోయింది. ఈ ఘటనతో ఆ మహిళల ఫ్రెండ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ట్రేసీ, నికోలాలు చేసిన అమానుషం వల్ల కోర్టు ఇద్దరికీ 25 నెలల జైలు శిక్ష వేసింది.