»Viktor Orban Pm Of Hungary Call Back Trump He Will Prevent Full Scale Ww3
Hungary pm: ప్రపంచాన్ని కాపాడే శక్తి ట్రంప్‌కు ఉంది..బైడెన్ వేస్ట్?
రష్యా, ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో హంగేరి ప్రధాన మంత్రి ట్రకర్ ఓ అంతార్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్ష పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా బైడెన్ వెస్ట్ అనే విధంగా వ్యాఖ్యానించారు.
Viktor Orban PM of Hungary Call back Trump he will prevent full-scale WW3
Viktor Orban: గత కొన్ని నెలలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine war) జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల అధ్యక్షులు ఎక్కడా కూడా తగ్గడం లేదు. దీంతో ఇది మూడవ ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందా అనే అనుమానం కూడా పలు దేశాలకు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్(Ukraine) సరిహద్దు ప్రాంతం అయిన హంగేరి(Hungary) ప్రధాన మంత్రి, నాటో(NATO) మెంబర్ అయిన విక్టోర్ ఓర్బన్(Viktor Orban) ట్రకర్(Trucker) అనే అంతార్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఇరు దేశాల యుద్దాన్ని ఆపడానికి జో బైడన్(Jo Biden) చేస్తున్న ప్రయత్నాలు శూన్యమని, ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకునే అమెరికా పాత్ర నామమాత్రమేనని పేర్కొన్నారు. ఇదే సమయంలో ట్రంప్(Donald Trump) ఉంటే విషయం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు శాంతి అత్యవసరం అని దాని కోసం మళ్లీ ట్రంప్ అధికారంలోకి రావాలన్నారు. ఆయనకు యుద్ధాన్ని ఆపే శక్తి ఉందని, గతంలో నార్త్ కొరియా, చైనాలతో ఆయన ఎలాంటి సంబంధాలు పెట్టుకున్నారో గుర్తు చేశారు. ఇక మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఆపే శక్తి కేవలం ట్రంప్‌కు మాత్రమే ఉందన్నారు. ఆయన ప్రపంచాన్నే రక్షించగల సమర్థుడని తెలిపారు. దీనిపై ఎలాన్ మస్క్(Elon Musk) సైతం రీ ట్వీట్ చేయడం విశేషం. ఇది చాలా ఆసక్తికరమైనది అని హంగేరి ప్రధాని ఆ దేశ జనన రేటు సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
Very interesting. Hungary is trying hard to address their birth rate problem. https://t.co/o6ssq6nefj