»73 Thousand People Stuck In The Mud Overnight Nevada Burning Man
Burning Man festival: రాత్రికి రాత్రే బురదలో చిక్కుకున్న 73 వేల మంది!
అగ్రరాజ్యం అమెరికాలోని నెవాడా(nevada)ఎడారిలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. బ్లాక్ రాక్ ఎడారిలో ఏర్పాటు చేసిన బర్నింగ్ మ్యాన్ వేడుక(Burning Man festival)లో భాగంగా భారీ వర్షానికి ఒక్కసారిగా పెద్ద ఎత్తున బురద ఆ ప్రాంతానికి కొట్టుకొచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న 73 వేల మంది అక్కడి నుంచి బయటకొచ్చేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
73 thousand people stuck in the mud overnight nevada Burning Man
ఓ ఫెస్టిఫల్(Burning Man festival) వేడుకలో భాగంగా రాత్రికి రాత్రే భారీ వర్షం వచ్చింది. దీంతో అక్కడికి వచ్చిన 73 వేల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు బురదలో చిక్కుకుని అనేక మంది తమ ప్రాంతాలకు వెళ్లేందుకు నానాా తంటాలు పడుతున్నారు. ఈ సంఘటన అమెరికా నెవాడా(nevada)లోని బ్లాక్ రాక్ ఎడారిలో చోటుచేసుకుంది. ఆగస్టు 27న ఈ వేడుక ప్రారంభం కాగా..సెప్టెంబర్ 4 వరకు కొనసాగనుంది. 40 అడుగుల దిష్టిబొమ్మను దహనం చేయడంతో వీరి పండుగ ముగుస్తుంది. ఆ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఆ ప్రాంతం మొత్తం చిందరవందరగా తయారైంది.
సాధారణంగా పొడిగా ఉన్న ఎడారిలో అంత పెద్ద ఎత్తున వర్షాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే నెలరోజుల్లో కురవాల్సిన వర్షం కేవలం శుక్రవారం సాయంత్రం ఒక్కరోజే కురిసిందని అంటున్నారు. ఆ నేపథ్యంలో నిర్వాహకులు తెచ్చుకున్న ఆహారం సహా వారు చెల్లాచెదురుగా మారిపోయారు. దీంతో వారిని రక్షించాలని కోరారు. కానీ మొత్తం ఆ ప్రాంతం బురద(mud) మయంగా మారడంతో రోడ్లపై డ్రైవింగ్, బైకింగ్ తాత్కాలికంగా నిషేధించబడింది. అంతేకాదు బ్లాక్ రాక్ సిటీ లోపల వెలుపల ఉన్న గేట్ విమానాశ్రయం మూసివేయబడింది. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్న వారు సురక్షితమైన ప్రదేశంలో ఆశ్రయం పొందాలని అక్కడి నిర్వహకులు తెలిపారు వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు విశ్రాంతి తీసుకోమని చెప్పారు.