నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు త్రిశూలి నదిలో కొట్టుకుపోయింది. అయితే ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రతికూల వాతావరణం నేపాల్ ప్రజలకు పెను సమస్యగా మారింది. ఈరోజు అంటే శుక్రవారం ఉదయం మధ్య నేపాల్‌లోని మదన్-ఆషిర్ హైవేపై కొండచరియలు విరిగిపడటంతో సుమారు 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి.
పెషావర్ విమానాశ్రయంలో సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ విమానంలో 276 మంది ప్రయాణికులు, 21 మంది సిబ్బంది ఉన్నారు.
చైనాలో విక్రయించే వంటనూనెలకు సంబంధించిన ఓ భారీ కుంభకోణం ఇప్పుడు ఆ దేశాన్ని కుదిపేస్తుంది. ప్రమాదకరమైన రసాయనాలు తరలించే కంటైనర్లలో మంచి నూనెను తరలిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ మేరకు అక్కడి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది.
ఇటీవల బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ పార్లమెంట్‌లో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారత సంతతికి చెందిన మొత్తం 27 మంది చట్టసభకు ఎన్నికయ్యారు. అయితే ఇందులో ఒకరు శివాని రాజా ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, యూకేలు భారీగా స్టూడెంట్ వీసా ఫీజులను పెంచేశాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి ప్రవాసులను ఉద్దేశించి మాట్లాడారు. భారత్ ఎప్పుడూ శాంతినే ప్రచారం చేస్తోందంటూ చెప్పుకొచ్చారు. అక్కడ ఆయన ప్రసంగ విశేషాలు ఇలా ఉన్నాయి.
ఫిలిప్పీన్స్‌లో నేరగాళ్లు సినీ ఫక్కీలో తప్పించుకుంటున్నారు. పోలీసుల కళ్లు కప్పేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని ఏకంగా ముఖ కవళికలనే మార్చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన రహస్య ఆసుపత్రులను పోలీసులు ఇటీవల మూసివేయించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.
భారత ప్రధాని మోదీ ఈరోజు ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. 41 ఏళ్లలో భారత ప్రధాని ఆస్ట్రియా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని నిలిపివేయమనే సమర్థత కేవలం భారత్‌కే ఉందని అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. నేడు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో జెలెన్‌స్కీ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌పై అమెరికా అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు ప్రధాన్యత సంతరించుకుంది.
ధాన మంత్రిగా మూడోసారి గెలిచిన తర్వాత రష్యా పర్యటనకి వెళ్లారు. ఈ సందర్భంగా రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. అయితే మోదీ పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ సోషల్ మీడియా ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యాకు తాను ఒక్కడినే రాలేదని... 140 కోట్ల మంది భారతీయుల ప్రేమను మోసుకొచ్చానని తెలిపారు.
అమెరికాలో భారతీయులకు ఊహించని షాక్ తగిలింది. మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు భారతీయ వ్యక్తులకు టెక్సాస్ పోలీసులు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు.
పెళ్లి చేసుకునేందుకు జంట అక్కర్లేదని నిరూపిస్తున్నారు జపాన్ యువతులు. ఈ మధ్య అక్కడ ఒంటరి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తమతో తాము ఎంతో ప్రేమగా ఉంటామని ప్రణామాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రమైన ట్రెండ్ ఏమిటో మనం తెలుసుకోకపోతే ఎలా?
రెండు రోజుల రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ తన జీవితాన్ని ప్రజలకు అంకితం ఇచ్చారని అన్నారు. రష్యాలోని మోదీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.