రాజధాని కీవ్‌తో పాటు ఉక్రెయిన్ నగరాలపై నిన్న రష్యా భీకర క్షిపణి దాడులకు దిగింది. ఈ దాడుల్లో కనీసం 30 మంది చనిపోయారని, 150 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది.
రష్యా, భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం రష్యా బయలుదేరారు. మాస్కో చేరుకున్న మోడీకి విమానశ్రయంలో సాదర స్వాగతం లభించింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా సోమవారం భారీ దాడి చేసింది. ఉక్రెయిన్‌పై ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం రష్యాలో పర్యటించేందుకు బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే?
బంగారు గనిలో కొండచరియలు విరిగిపడడంతో 11 మంది మృతి చెందారు. మొత్తం గనిలో 33 మంది పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన మరో 20 మంది కోసం అధికారులు గాలిస్తున్నారు.
పాకిస్థాన్‌లో ఓ తండ్రి నిండు ప్రాణంతో ఉన్న తన కన్నకూతురిని పొట్టన పెట్టుకున్నారు. పుట్టిన 15 రోజులకే ఆ పసికందును సమాధి చేశాడు. దానికి అతను చెప్పిన కారణం వింటే షాక్ కావాల్సిందే.
స్టాగ్ బీటిల్ పురుగు ఖరీదు తెలిస్తే షాక్ కావాల్సిందే. దీని ఖరీదు రూ.75 లక్షలు ఉంటుందట. అసలు ఈ పురుగు ఖరీదు ఎందుకు అంత ఉంటుందో తెలుసుకుందాం.
హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మరణించడంతో ఇరాన్‌లో కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మసౌద్ పెజెష్కియాన్ విజయం సాధించారు.
బ్రిటన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్ బకింగ్‌హామ్ ప్యాలెస్ చేరుకున్నారు.
దక్షిణాఫ్రికాలోని పొడి ప్రాంతంలో 30వేల ఏళ్ల నాటి చెదపురుగుల దిబ్బలను కనుగొన్నారు. వాటి వయసు 30,000 సంవత్సరాలకు పైగా ఉన్నాయని తెలుసుకుని వారు ఆశ్చర్యపోయారు.
మలేషియాలోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ సదుపాయంలో గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో సుమారు 39 మంది అస్వస్థతకు గురయ్యారు.
బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి పరాజయం ఖరారైంది. దీంతో ఈ విషయమై భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే?
ప్రస్తుతం బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. బ్రిటన్‌ను 14 ఏళ్ల పాటు పాలించిన కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ఊరట లభించింది. అతనిని వెంటాడిన తోషాఖానా కేసులో ఆయనకి విముక్తి లభించింది.
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ప్రస్తుతం ఆహార కొరత ఉంది. అయితే ఫిన్‌లాండ్‌కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ గాలి, విద్యుత్‌తో ఓ ప్రొటీన్ పౌడర్‌ను తయారు చేసింది.