కెరీర్ ప్రారంభంలో ప్లేట్స్, టాయిలెట్స్ శుభ్రం చేసినట్లు ప్రముఖ కంపెనీ సీఈఓ జాన్సెన్ హువాంగ్ ఓ వీడియోలో తెలిపారు. చేసే పని చిన్నదా, పెద్దదా అని కాదు ఎంత నిబద్ధతో చేస్తున్నాము అనేది ముఖ్యం అని అంటున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మయన్మార్ ప్రజలు సైన్యం పాలనలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. సైన్యం కఠిన చట్టాల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉద్యోగులకు జీతాలు పెంచారన్న కారణంతో కొంతమంది దుకాణ యజమానులను అక్కడి సైనిక ప్రభుత్వం జైలుకు పంపించింది.
బ్రిటన్ ప్రజలు తమ ప్రధానిని ఎన్నుకునే తరుణం ఎట్టకేలకు ఆసన్నమైంది. రేపు అంటే జూలై 4న బ్రిటన్‌లో ఓటింగ్ జరగనుంది.
సముద్రాలు పచ్చగా మారుతున్నాయి. సముద్రపు పర్యావరణం ఆ రకంగా మార్పులు చెందుతోంది. తాజా పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ప్రపంచ కుబేరుళ్లో ఒకరైన దిగ్గజ వ్యాపార వేత్త జెఫ్ బెజోస్ దినచర్య ఎలా ఉంటుందో అని అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. తాజాగా ఆయన తన డైలీ రొటీన్, రోజులోని ఆయన ఇంపార్టెంట్ టైమ్ గురించి చెప్పారు.
భారతి సంతతికి చెందిన వ్యాపారవేత్తలు అమెరికాలో బిలియన్ డాలర్ల స్కామ్‌కు పాల్పడ్డారు. దీంతో వాళ్లకు జైలు శిక్ష విధించారు. ఒకప్పుడు చికాగోలో స్టార్టప్ మోసాలకు పాల్పడ్డారని విచారణలో తేలడంతో జైలు శిక్ష విధించారు.
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ సంపదను ఆ సంస్థ మాజీ ఉద్యోగి దాటేశారు. స్టీవ్ బల్మర్ ప్రపంచంలోనే ఆరవ సంపన్నుడిగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఎలాగంటే..?
ఇంతవరకు మనుషులు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారని తెలుసు కానీ తొలిసారిగా ఒక రోబో ఆత్యహత్య చేసుకుంది. దక్షిణ కొరియాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
ఓ విమాన ప్రయాణికుడు టర్బులెన్స్ కారణంగా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. గాల్లో వచ్చిన విపరీతమైన టర్బులెన్స్ వల్ల విమానం తీవ్రంగా కుదుపులకు లోనైంది. దీంతో అతడు రూఫ్‌కి గుద్దుకుని అక్కడే ఇరుక్కుపోయాడు. మిగిలిన ప్రయాణికులకు సైతం ఫ్రాక్చర్లు అయ్యాయి.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ప్రస్తుతం సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మంత్రి జర్తాజ్ గుల్ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈమె మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ సాధిక్ చూడకపోవడంతో జర్తాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
123 ఏళ్ల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆస్ట్రేలియా చరిత్రను సృష్టించింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తీసుకున్న ఒక నిర్ణయానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.
రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్ రష్యాతో పోరాడుతుంది. యుద్ధ భూమి కోసం తీవ్రమైన సిబ్బంది కొరత కూడా ఉంది. అయితే సైన్యాన్ని పటిష్ఠం చేసేందుకు ఉక్రెయిన్ ముమ్మరంగా నియామకాలు చేపడుతోంది. ఈక్రమంలోనే తొలిసారిగా జైల్లోని ఖైదీలను మిలటరీలోకి తీసుకోవడానికి సిద్ధమైంది.
చైనాలో ఊహించని విధంగా ఓ రాకెట్ లాంచింగ్ జరిగింది. ప్రయోగానికి సిద్ధం చేస్తున్న రాకెట్‌లోని మొదటి భాగంలో సాంకేతిక లోపాలు ఉండటంతో అది ఉన్నట్లుండి నింగికి ఎగిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడిన 60 మంది భారతీయులను శ్రీలంకలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అరెస్టు చేసింది. జూన్ 27న కొలంబో శివారు ప్రాంతాలైన మడివేలా, బత్తరముల్లా, పశ్చిమ తీర నగరమైన నెగోంబో నుండి పోలీసులు వారందరినీ అరెస్టు చేశారు.
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూపై చేతబడి చేశారన్న ఆరోపణలపై ఇద్దరు మంత్రులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పర్యావరణ శాఖ సహాయ మంత్రి షమ్నాజ్ సలీమ్, షమ్నాజ్ మాజీ భర్త, రాష్ట్రపతి కార్యాలయంలో మంత్రిగా పనిచేస్తున్న ఆడమ్ రమీజ్‌లతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.