»Pakistan Speaker I Cant Talk Directly Into Womens Eyes
Pakistan Speaker: మహిళల కళ్లలోకి సూటిగా చూస్తూ మాట్లాడలేను
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ప్రస్తుతం సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మంత్రి జర్తాజ్ గుల్ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈమె మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ సాధిక్ చూడకపోవడంతో జర్తాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pakistan Speaker: I can't talk directly into women's eyes
Pakistan Speaker: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ప్రస్తుతం సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మంత్రి జర్తాజ్ గుల్ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈమె మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ సాధిక్ చూడకపోవడంతో జర్తాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పార్టీ నాకు ఇతరుల కళ్లలోకి సూటిగా చూస్తూ మాట్లాడటం నేర్పించింది. ప్రజల తరపున వచ్చిన నాయకురాలిని నేను. 1,50,000 ఓట్లతో సభలో అడుగుపెట్టాను. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు నావైపు చూడకపోతే నేను మాట్లాడలేను. దయచేసి మీరు కళ్లజోడు పెట్టుకుని నావైపు చూడండని ఆమె స్పీకర్ను కోరారు.
దీనికి స్పీకర్ నవ్వుతూ స్పందిస్తూ.. నేను మీ మాటలు వింటాను. కానీ మహిళల కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడలేను. ఇలా మాట్లాడటం మర్యాదగా అనిపించదు. అందుకే మిమ్మల్ని సూటిగా చూడట్లేదన్నారు. దీంతో సభలో అందరూ నవ్వారు. ఆ తర్వాత జర్తాజ్ గుల్ మాట్లాడుతూ మహిళలను సూటిగా చూడకుడదని సభలో 52 శాతం మహిళలను తొలగిస్తే మీరు ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే సభలో ఉంటారన్నారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.