»Wash The Plates Wash The Toilets Jensen Huang Ceo Of The Famous Company Nvidia
Nvidia CEO: ప్లేట్స్ కడిగా.. టాయిలెట్స్ కడిగా.. ప్రముఖ కంపెనీ సీఈఓ
కెరీర్ ప్రారంభంలో ప్లేట్స్, టాయిలెట్స్ శుభ్రం చేసినట్లు ప్రముఖ కంపెనీ సీఈఓ జాన్సెన్ హువాంగ్ ఓ వీడియోలో తెలిపారు. చేసే పని చిన్నదా, పెద్దదా అని కాదు ఎంత నిబద్ధతో చేస్తున్నాము అనేది ముఖ్యం అని అంటున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Wash the plates.. Wash the toilets.. Jensen Huang, CEO of the famous company Nvidia
Nvidia CEO: ప్రపంచంలో గొప్పవారంత ఒకప్పుడు సాధారణ జీవితం గడిపినవారే. అయితే వారు చేసే పని, ఆ పనిపట్ల వారికున్న నిబద్దతే వారిని ఉన్నత శిఖరాలలో నిలబెట్టింది. నిజానికి ఇవన్ని ఏదో మోటివేషన్ స్పీచ్ ఇచ్చినట్లు ఉంటాయి కానీ అదే నిజం అని, మన ప్రయాణంలో దేన్నీ తక్కువగా చూడొద్దంటున్నారు ప్రముఖ కంపెనీ సీఈఓ జాన్సెన్ హువాంగ్. ఈయన ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ ఎన్విడియా (Nvidia) సీఈఓ. మనం చేసే పని ఏదైనా సరే దానికి విలువ ఇవ్వాలని, అప్పుడే జీవితంలో ఎదుగుతామన్నారు. ఆయన తాజాగా ఓ వీడియోను పంచుకున్నారు. అందులో ఆయన కేరీర్ ప్రారంభంలో టాయిలెట్స్ కడిగినట్లు కూడా చెప్పారు. తన మాటలు వినడానికి ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నా..అవి అక్షరసత్యాలు అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
‘‘తన వరకు ఏ పనీ చిన్నది కాదు అంటున్నారు. కెరీర్ ప్రారంభంలో తాను ఓ బ్రేక్‌ఫాస్ట్ సెంటర్లో పనిచేసేవాడట. అప్పుడు గిన్నెలు శుభ్రం చేయడం, టాయిలెట్లు కడగడం తన డ్యూటీ. వీడియోలో మాట్లాడుతూ.. ఇక్కడున్న మీ అందరి కంటే ఎక్కువ టాయిలెట్లు శుభ్రం చేసుంటా అని పేర్కొన్నారు. అందుకే తాను అన్నిరకాల పనులను గౌరవిస్తాను అని చెప్పారు. ముఖ్యంగా అందరినీ సమానంగా చూడడం నేర్చుకున్నాను అని తన కంపెనీలో చిన్న, పెద్ద అనే తేడా చూపను అని తెలిపారు. చిన్న పనిచేసే వారి భుజంపై చేయి వేసి అండగా నిలబడుతున్నా అని వెల్లడించారు. తక్కువ అనే పని ఏదీ లేదు, అన్ని పనులను గౌరవించాలి అని సీఈఓ జాన్సెన్ హువాంగ్ (Nvidia CEO Jensen Huang) చెప్పుకొచ్చారు.
ఆయన ఓ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ ఫంక్షన్లో ఈ మాటలు మాట్లాడారు. ఆ మాటలను ఓ జర్నలిస్టు షేర్ చేయగా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడతుంది. ఆ వీడియోను ఎక్స్‌లో షేర్ చేయగా దానికి ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. హువాంగ్‌పై ప్రశంసలు కురిపించారు. దీనిపై ఓక పోస్టు సైతం పెట్టారు.. కచ్చితంగా ఇది గొప్ప అని, కొవిడ్ టైమ్‌లో టాయిలెట్ పేపర్ల కొరత ఏర్పడినప్పుడు, ఫ్యాక్టరీలో, ఆఫీసుల్లో వాటిని సరిపడా అందుబాటులో ఉంచగలిగా అంటూ మస్క్ రాసుకొచ్చారు.