జీ20 సదస్సులో భాగంగా భారత్ వచ్చిన కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో(justin trudeau)కు ఓ వింత అనుభవం ఎదురైంది. సమావేశాల తర్వాత అతను తిరిగి తన దేశానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వచ్చిన ఫ్లైట్లో సాంకేతిక సమస్య కారణంగా రెండు రోజులు ఇక్కడే ఉండిపోయారు. అంతేకాదు ఇండియా(india) సాయం చేస్తామని చెప్పినా కూాడా తిరస్కరించారు.
కూతురంటే ప్రతి తండ్రికీ ఎంతో ఇష్టం. వారి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కూతురి మీద ప్రేమ ఉండే ఓ తండ్రి తన బిడ్డపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకుని వరల్డ్ రికార్డు సాధించాడు. తన కూతురి పేరును 667 సార్లు టాటూలు వేయించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు.
రత్నాల గనుల కింద ఓ ఊరుంది. గ్రామంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ భూగర్భంలో మాత్రం అంత వేడి ఉండదు. చల్లగా ఉండటం వల్ల పాతాళంలోనే అందరూ ఇళ్లను నిర్మించుకున్నారు.
భూమిపై భూకంపాలు రావడం సహజమే. తాజాగా మొరాకోలో భూకంపం సంభవించి 2వేల మందికిపైగా మృతిచెందారు. గాయాలపాలైన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. ఈ మధ్య భారత్‌లోని పలు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ భూకంపాల గురించి నాసా కీలక రిపోర్ట్ అందించింది.
చాట్‌జీపీటీ(ChatGPT) వీక్షించేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని సిమిలర్ వెబ్ సంస్థ వెల్లడించింది. మార్చి నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో దీని వీక్షణ సమయం మరింత తగ్గిందని తెలిపింది.