బ్రెజిల్(brazil)లోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో ఓ ప్రయాణీకుల విమానం శనివారం కూలిపోయింది. దీంతో అందులో ఉన్న మొత్తం 14 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా తెలిపారు.
జాహ్నవి కందుల మృతిని హేళన చేస్తూ సియోటెల్ పోలీసు నవ్విన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అమెరికా, భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోపై సదరు పోలీసు ఆఫీసర్ వివరణ ఇచ్చారు.
ఎయిర్ పోర్టులో ప్యాసింజర్ల బ్యాగులను చెక్ చేసే అధికారులు తమ చేతివాటం చూపించారు. బ్యాగ్‌ను చెక్ చేస్తున్నట్లు నటిస్తూ అందులో ఉన్న క్యాష్‌ను దొంగలించి తమ జేబుల్లో పెట్టుకున్నారు. ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్ కరాచీ బేకరీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచంలోని 150 డెజర్ట్ ప్రదేశాలలో భారత్‌కు చెందిన పలు వంటకాలు ఆ జాబితాలో నిలిచాయి. అందులో హైదరాబాద్ కరాచీ బేకరీకి 29వ స్థానం దక్కింది.
కోట్లు విలువ చేసే పెద్ద పెద్ద భవనాలను కేవలం రూ.100లకే అమ్మేశారు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా అదే నిజం. ఈ సంఘటన యూకేలో చోటుచేసుకుంది.
మెక్సికన్ కాంగ్రెస్ లో వెయ్యేళ్లకు చెందిన ఏలియన్స్ అస్తి పంజరాలు ప్రదర్శనకు పెట్టారు. దీనిపై ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చిస్తుంది. వాటి నుంచి శాస్త్రవేత్తలు డీఎన్ఏ ఆధారాలను శాస్త్రవేత్తలు సేకరించారు.
లిబియాలో తుఫాను వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. దీంతో భారీ వరదల కారణంగా 6000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అక్కడి అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు 30 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారని వెల్లడించారు.
అమెరికా(America)లో ఏపీకి చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టి మృత్యువాత చెందింది. అయితే ఆ క్రమంలో విచారణ కోసం అక్కడికి వచ్చిన పోలీస్ అధికారి యువతి మృతి పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. ఇటివల ఆ వీడియో వెలుగులోకి రావడంతో అనేక మంది అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచంలోనే ఓ కోడి అత్యధిక రోజులు జీవించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ప్రస్తుతం ఆ కోడి వయసు 21 ఏళ్లు. ఇంకా ఆ కోడి ప్రాణాలతో జీవిస్తోంది. ఆ కోడి తెలివితేటలకు అందరూ ఆశ్చర్యపోతున్నారు.
విమానం వాష్‌రూంలో శృంగారంలో మునిగితేలుతూ ఓ జంట సిబ్బందికి దొరికిపోయారు
బ్రిటన్ పై పుతిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రష్యా అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడి చేసేందుకు ఉక్రెయిన్ సైనికులు బ్రిటిష్ శిక్షకులచే శిక్షణ పొందారని ఆయన చెప్పారు.
ఈ జపనీస్ వ్యక్తి పేరు సోషల్ మీడియాలో ‘టోకో’గా పేర్కొన్నారు. టోకో కుక్క వేషధారణకు దాదాపు 12 లక్షల రూపాయలు ఖర్చు చేసి, అప్పటి నుంచి కుక్కలా బతుకుతున్నాడు.
'డేనియల్' తుఫాను తర్వాత సంభవించిన వరద ఉత్తర ఆఫ్రికా దేశం లిబియాలో విధ్వంసం సృష్టించింది. వరదల కారణంగా ఇప్పటివరకు 5300 మందికి పైగా మరణించగా, పది వేల మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఐఫోన్ 12పై నిషేధం విధించారు. ఆ ఫోన్ నుంచి అధిక స్థాయిలో రేడియేషన్స్ విడుదల అవుతున్న తరుణంలో బ్యాన్ చేసినట్లు ఐఫోన్ సంస్థ వెల్లడించింది.
అర్ధరాత్రి 11.30 గంటలకు ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 50 మందికిపైగా మృత్యువాత చెందగా.. 25మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు.