»Hyderabad Karachi Bakery Ranked Among Most Best Dessert Places In The World
Karachi Bakery: హైదరాబాద్ కరాచీ బేకరీకి అంతర్జాతీయ గుర్తింపు
హైదరాబాద్ కరాచీ బేకరీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచంలోని 150 డెజర్ట్ ప్రదేశాలలో భారత్‌కు చెందిన పలు వంటకాలు ఆ జాబితాలో నిలిచాయి. అందులో హైదరాబాద్ కరాచీ బేకరీకి 29వ స్థానం దక్కింది.
హైదరాబాద్ (Hyderabad) అంటే అందరికీ చాలా ఇష్టం. ఈ నగరంలో చారిత్రక కట్టడాలు, వందల ఏళ్ల చరిత్ర కలిగిన సాక్ష్యాలు ఉన్నాయి. చారిత్రక నిర్మాణాలకే కాకుండా అద్భుతమైన వంటకాలకు కూడా హైదరాబాద్ ఫేమస్. హలీమ్ మొదలు బిర్యానీ వరకూ హైదరాబాద్ పెట్టింది పేరు. అందులో కరాచీ బేకరీ (Karachi Bakery) కూడా ఒకటి. దేశంలోనే ఈ హైదరాబాద్ కరాచీ బేకరీకి ఎంతో చరిత్ర ఉంది. తాజాగా ఈ బేకరీ అంతర్జాతీయ గుర్తింపును పొందింది.
Ladies and gentlemen, the 150 most legendary dessert places in the world & their iconic desserts. Save this link, there aren't many more important lists you'll come across in life: https://t.co/tWAkslvZRLpic.twitter.com/gzFywqp4gE
ప్రపంచవ్యాప్తంగా 150 అత్యంత ప్రసిద్ధ డెజర్ట్ ప్రదేశాలలో టేస్ట్ అట్లాస్ జాబితాలో హైదరాబాద్ కరాచీ బేకరీ స్థానాన్ని సంపాదించుకుంది. టేస్ట్ అట్లాస్ ప్రపంచవ్యాప్తంగా 29వ అత్యుత్తమ డెజర్ట్‌గా కరాచీ బేకరీ ఫ్రూట్ బిస్కెట్లను ర్యాంక్ చేయడం విశేషం. 29వ స్థానాన్ని బేకరీ పొందిందని కరాచీ బేకరీ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.
కరాచీ బిస్కెట్ (Karachi Biscuits)లకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ బిస్కెట్లను క్యాండీడ్ ఫ్రూట్‌తో సాఫ్ట్‌గా, టేస్టీగా చేస్తారు. కరాచీ బేకరీతో పాటుగా భారత్‌కు చెందిన మరో తొమ్మిది ఫుడ్ ఐటెమ్స్‌కు కూడా గుర్తింపు లభించడం విశేషం. టేస్ట్ అట్లాస్ సంస్థ ప్రపంచంలోని 150 అత్యంత ప్రసిద్ధ డెజర్ట్ ప్రదేశాల జాబితాను రూపొందించింది. అందులో భారత్‌కు చెందిన పలు వంటకాలు ఉన్నాయి.
జాబితాలో పుణేలోని కయానీ బేకరీ 18వ స్థానం పొందింది. కోల్‌కతా లోని కెసిదాస్ 25వ స్థానం, కోల్‌కతాలోని ఫ్లూరీస్ 26, కోల్‌కతాలోని బలరామ్ ముల్లిక్ అండ్ రాధారామన్ ముల్లిక్ 37, ముంబైకి చెందిన కె రుస్తోమ్ అండ్ కో 49, న్యూఢిల్లీలోని కురేమల్స్ కుల్ఫీకి 67, లక్నోలోని ప్రకాష్ మషూర్ కుల్ఫీకి 77, పుణేలోని చితాలే బంధుకు 85, న్యూఢిల్లీలోని జలేబీ వాలాకు 93వ స్థానం దక్కడం విశేషం.