'డేనియల్' తుఫాను తర్వాత సంభవించిన వరద ఉత్తర ఆఫ్రికా దేశం లిబియాలో విధ్వంసం సృష్టించింది. వరదల కారణంగా ఇప్పటివరకు 5300 మందికి పైగా మరణించగా, పది వేల మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Libya Floods: ‘డేనియల్’ తుఫాను తర్వాత సంభవించిన వరద ఉత్తర ఆఫ్రికా దేశం లిబియాలో విధ్వంసం సృష్టించింది. వరదల కారణంగా ఇప్పటివరకు 5300 మందికి పైగా మరణించగా, పది వేల మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. డెర్నా నగరం పూర్తిగా ధ్వంసమైంది. లిబియా తూర్పు ప్రాంతంలో వరదల వినాశనం కనిపించింది. డెర్నాలో మరణించిన వారి సంఖ్య 5,300 దాటిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహ్మద్ అబు-లమోషా తెలిపారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లోని రెండు డ్యామ్‌లు తెగిపోవడంతో నీటి ప్రవాహానికి దారితీసింది. దీనిలో వేలాది మంది ప్రజలు కొట్టుకుపోయారు. వీరిలో చాలా మంది ఇప్పటికీ కనిపించకుండా పోయారు. డెర్నా నగరంలో నాలుగో వంతు ధ్వంసమైందని చెబుతున్నారు. వరదల కారణంగా 10 వేల మంది గల్లంతయ్యారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ టెడ్ క్రెసెంట్ సొసైటీస్ లిబియా రాయబారి తామెర్ రంజాన్ తెలిపారు.
తూర్పు లిబియా ఆరోగ్య మంత్రి 1,000 కంటే ఎక్కువ మృతదేహాలను సేకరించారని, అందులో కనీసం 700 మందిని ఇప్పటివరకు ఖననం చేశారని చెప్పారు. డెర్నా అంబులెన్స్ అథారిటీ 2,300 మంది మరణాలను ధృవీకరించింది. ఆదివారం రాత్రి డెర్నా , తూర్పు లిబియాలోని ఇతర ప్రాంతాలలో వరదలు భారీ విధ్వంసం సృష్టించడం గమనార్హం. తుఫాను తీరాన్ని తాకిన వెంటనే డెర్నా నివాసితులు పెద్ద పెద్ద పేలుళ్లు విన్నారని.. నగరం వెలుపల ఉన్న ఆనకట్టలు కూలిపోయాయని చెప్పారు. విపత్తు సంభవించిన 36 గంటల తర్వాత కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి సహాయక సిబ్బందిని రప్పించారు. 89,000 జనాభా ఉన్న నగరంలోని రోడ్లు వరదల కారణంగా కొట్టుకుపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డెర్నా డిప్యూటీ మేయర్, అహ్మద్ మద్రౌడ్, నగరంలో కనీసం 20 శాతం ధ్వంసమైందని మీడియాతో చెప్పారు.
డెర్నాలో వినాశకరమైన వరదల కారణంగా ఎక్కడ చూసినా మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆసుపత్రుల్లో మృతదేహాలను ఉంచేందుకు స్థలం కొరత ఉంది. చనిపోయిన వారి సంఖ్యను ఖచ్చితంగా నిర్ధారించడం సాధ్యం కాదు. మంగళవారం సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, ఇతర స్థానిక అత్యవసర అధికారులు చనిపోయిన వారి కోసం వెతకడానికి శిధిలాల్లో పరిశోధించారు. నీటిలో ఉన్న కుటుంబాల మృతదేహాలను బయటకు తీసేందుకు వారు పడవలను కూడా ఉపయోగించారు. డేనియల్ తుఫాను వల్ల ఈ విధ్వంసం సంభవించింది. గత వారం గ్రీస్‌లో కూడా చాలా నష్టం వాటిల్లింది.