»Alert To The People Of Hyderabad Highest Temperature Recorded In Khairatabad
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్..ఖైరతాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
హైదరాబాద్‌లో నిన్నటి వరకూ వర్షాలు దంచికొడితే ఇప్పుడు ఎండలు బాదేస్తున్నాయి. నగరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో ప్రజలు ఉక్కపోతలతో ఇబ్బంది పడుతున్నారు.
తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్ (Hyderabad) నగరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు (Temperature) నమోదయ్యాయి. నగరం మొత్తం ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బుధవారం ఉదయం నుంచే ఎండలు దంచికొట్టడంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలో అత్యధికంగా ఖైరతాబాద్‌లో అత్యధికంగా 32.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
మరో మూడు రోజుల పాటు 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు (Hyderabad weather Department) వెల్లడించారు. బంగాళాఖాతం మధ్య భాగంతో పాటుగా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
సెప్టెంబర్ 16, 17వ తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రుతుపవనాల (Monsoon) సమయంలో అల్పపీడం ఏర్పడటం అనేది సాధారణమేనని, దీంతో దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Weather Department) వెల్లడించింది.