Rk Roja, Vidadala Rajani, Avanthi Srinivas, KCR Before And Now
Before And Now: శాశ్వత మిత్రులు కానీ శత్రువులు కానీ ఉండరు అంటారు. సినిమాల్లో కన్నా రాజకీయాలకు ఈ సామెత కరెక్టుగా సరిపోతుంది. అధికారం మారితే పార్టీ మారే నేతలు ఎక్కువ మంది ఉన్నారు. గతంలో పార్టీ అధినేతలపై ప్రశంసలు కురిపించి.. ఇప్పుడు బండబూతులు తిట్టేవారు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో ఆర్కే రోజా (roja), విడదల రజనీ (rajani), అవంతి శ్రీనివాస్ (avanthi srinivas), కొడాలి నాని (kodali nani), కేసీఆర్ (kcr) నిలుస్తారు. గతంలో ఆహా, ఒహో అని.. ఇప్పుడు రాయరానీ భాషలో తిడుతోన్న నేతలు ఉన్నారు.
చదవండి: Chandra Babu: బాబు కేసులో 18 వరకు విచారణ వద్దు..ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశం
మందళగిరి అనే మందబుద్ది
ముందుగా ఏపీ మంత్రి ఆర్కే రోజా గురించి తెలుసుకుందాం. రోజా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయ రంగ చేశారు. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ రోజైతే వైఎస్ఆర్ను కలిశారో.. అప్పుడే ఆమె టీడీపీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. టీడీపీలో ఉన్న సమయంలో పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. మహానాడు కార్యక్రమానికి వక్తగా వ్యవహరించిన సమయంలో చంద్రబాబును పొగిడారు. తెలుగు తల్లి అన్నపూర్ణమ్మ వరాల పట్టి, నందమూరి సింహా రాజకీయ వారసుడు.. స్వర్ణాంద్రప్రదేశ్ సృష్టికర్త, తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు.. తెలుగు సింహాం, అపర రాజకీయ మేద దురందరుడు, పేదల పాలిటి పెన్నిది, తెలుగువారి ఆత్మభిమానాన్ని ప్రపంచవ్యాప్త నలుదిశలా వ్యాపింపజేసిన కీర్తి వెలుగులా చంద్రుడు.. తెలుగు సామ్రాజ్య వీర ధీర శూర రాజకీయ చక్రవర్తి అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఆ వీడియో చూస్తే.. మరీ ఇంత ప్రశంసించాలా అనే సందేహాం వస్తోంది. సీన్ కట్ చేస్తే.. వైసీపీలో చేరారు. వైసీపీలో చేరినప్పటికీ చాలా కష్టపడ్డారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు జగన్ ఎంత కష్టపడ్డారో.. గెలిచి, నిలిచేందుకు రోజా కూడా శ్రమించారు. జబర్దస్త్ షో చేస్తూనే.. పార్టీ కోసం సమయం కేటాయించారు. సమయం దొరికితే చాలు చంద్రబాబు, లోకేశ్ లక్ష్యంగా విమర్శలు చేశారు. తన కొడుకు ఫారిన్ చదువు అంటూ అసెంబ్లీలో విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే దేశమో, రాష్ట్రమో తెలియదని విమర్శించారు. వర్ధంతి, జయంతికి తేడా తెలియదు అని.. తాను పోటీ చేసిన నియోజకవర్గం మంగళగిరిని.. మందళగిరి అనే మందబుద్ది గల వ్యక్తి లోకేశ్ అని విరుచుకుపడ్డారు.
రావణసూరుడు చనిపోతే..?
గత 45 ఏళ్లుగా చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని రోజా ఆరోపించారు. అవినీతికి పాల్పడుతూ, నీతిమంతుడిలా ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి.. చివరికీ కటకటలా పాలయ్యాడని గుర్తుచేశారు. రావణసూరుడు చనిపోతే ఎలా ప్రజల పండగ చేసుకున్నారో.. చంద్రబాబు జైలుకి వెళితే అలా సంబరాలు చేసుకున్నారని ఉదహరించారు. అప్పు చేసి లక్ష కోట్లకు పైగా దోచుకున్నాడని వివరించారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఏంగా వాడుకున్నాడని.. అమరావతి భూములను దోచుకున్నాడని తెలిపారు. తనను ఎవరు టచ్ చేయలేరని.. పీకలేడని.. ఇప్పుడు మూల కూర్చొని చిప్ప కూడు తింటున్నారని తెలిపారు. చంద్రబాబు కోసం తాను 10 ఏళ్లు పనిచేశా.. ఈగ వాలకుండా చూశానని రోజా గుర్తుచేశారు. తనను రాజకీయంగా సమాధి చేశారని.. రూల్స్‌కి విరుద్దంగా పనిచేశాడని వాపోయారు. ఆ సమయంలో తన భర్త, పిల్లలు పెట్టిన కన్నీళ్లకు ఇప్పుడు న్యాయం జరిగిందని అన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు.. గోదావరి పుష్కరాల సమయంలో పబ్లిసిటీ పిచ్చితో జనాలను చంపేశారని.. ఫుటేజీ కూడా దొరకనీయలేదని రోజా గుర్తుచేశారు. వారి ఉసురు ఇప్పుడు చంద్రబాబుకు తగిలిందని వివరించారు.
ఇక జైలే
చంద్రబాబు చేసిన తప్పులకు శిక్షలు పడటం ఇప్పుడు స్టార్ట్ అయ్యిందని రోజా వివరించారు. ఇక ఆయన జైలు నుంచి బయటకు రారని చెప్పారు. 2014-19 వరకు చేసిన తప్పులకు సంబంధించి ఐటీ, ఈడీ నోటీసులు ఇచ్చిందని అంటున్నారు. చాలా మంది జీవితాలు నాశనం చేసి.. జైలుకు పంపించారని.. కొందరినీ పైకి పంపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ చంద్రబాబు అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌కు సంబంధించి రూ.118 కోట్ల ముడుపులను చంద్రబాబు పీఏ శ్రీనివాస్ అనే వ్యక్తి తీసుకున్నారాని.. తీసుకొచ్చింది లోకేశ్ ఫ్రెండ్ కిలారి రాజేశ్ అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రూ.2 వేల కోట్ల స్కామ్ జరిగిందని.. బోగస్ బిల్లులు, స్కామ్ చేశారని రోజా ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో టీడీపీ రాజకీయంగా భూ స్థాపితం అయిపోయిందని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే ఇంటి వద్ద టపాకులు కాల్చుతూ రోజా సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు.
అంతలోనే రజనీ ఇలా
తెలంగాణకు చెందిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మహిళ. అత్తగారిల్లు మాత్రం ఏపీ. భర్తతో అమెరికాలో ఉండి.. తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయంగా ఓనమాలు నేర్చుకున్నారు. ఓ సమావేశంలో.. చంద్రబాబు ముందు సైబరాబాద్‌లో పెట్టిన చెట్టు మొక్కను సార్ నేను అంటారు. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతోంది. అలా ఎదిగి, ఇలా అయ్యానని.. నన్ను నన్న నా దేశం నమా నమామి అంటూ.. జై తెలుగుదేశం అని రజనీ నినాదిస్తారు. తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో వైసీపీలో చేరతారు. ఓ సభ వేదికగా సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపిస్తారు. తనకు రాజకీయ జీవితం ప్రసాదించింది జగన్ అంటారు. ఎమ్మెల్యే పదవీ, మంత్రి పదవీ ఇచ్చింది మీరేనని అంటారు. భవిష్యత్ మీరు.. రాజకీయ ఎదుగుదలకు కారణం మీరే, మీరు పెట్టిన భిక్ష వల్లే ఇలా అయ్యానని అంటారు. సో.. రజనీ కూడా అంతలోనే ఫ్లేటు ఫిరాయించారు. ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
బాబు చేస్తే సంసారం..?
ఏపీకి చెందిన కీలక నేత. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు కష్టపడుతుంది ఆయన కోసమో, లోకేశ్ కోసమో, దైవాంశ్ కోసమో కాదన్నారు. 5 కోట్ల మంది ప్రజల కోసం అని గుర్తుచేశారు. విజభన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు. పొత్తులేకుండా గెలిచామని.. కేంద్రం సహకరిస్తోందని బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని వివరించారు. అలా ఇద్దరు టీడీపీ నేతలు అశోక గజపతిరాజు, సుజనా చౌదరీకి కేంద్ర మంత్రి పదవులు లభించాయని తెలిపారు. విభజన చట్టాల్లో పెట్టిన అంశాల గురించి పోరాటం చేశామని.. హోదా, ప్యాకేజీ అని మోసం చేశారని గుర్తుచేశారు. విశాఖకు రైల్వే జోన్ కూడా ఇవ్వలేదని.. విజయనగరంలో గిరిజన వర్సిటీ కూడా లేదన్నారు. 24 అంశాల మీద మాట్లాడేందుకు 29 సార్లు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని గుర్తుచేశారు. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసినప్పటికీ ఉపయోగం లేదని చెప్పారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన తర్వాత అవంతి ఫ్లేట్ ఫిరాయించారు. వైఎస్ఆర్ మాదిరిగా బీసీల కోసం జగన్ పనిచేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. జగన్ వస్తేనే వైఎస్ఆర్ మాదిరిగా మంచి పాలన వస్తోందని చెప్పారు. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో చంద్రబాబుతో ఏ పని చేయించుకోలేదని.. హెల్ప్ తీసుకున్నానని నిరూపిస్తే దేనికైనా సిద్దం అని సవాల్ విసిరారు. గతంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని.. నలుగురికి మంత్రి పదవులు ఇవ్వలేదా..? బాబు చేస్తే సంసారం అంటూ ఘాటుగా మాట్లాడారు.
కేసీఆర్ కౌంటర్
కేసీఆర్ కీలక నేత.. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. తర్వాత టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 2009లో కూడా చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. బడ్జెట్, సంపద చంద్రబాబు పెంచారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.10 వేల కోట్ల లోపు బడ్జెట్ ఉండేదని.. దానిని బాబు రూ.53 వేల కోట్లకు తీసుకొచ్చారని వివరించారు. అలా బాబు పెంచిన సంపదను వైఎస్ఆర్ ఎంజాయ్ చేశారని విమర్శించారు. చంద్రబాబు పెట్టిన సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్ వెన్నులో వణుకు మొదలైందని వివరించారు. భయం, ఆందోళన, పెడబొబ్బులు, ఈర్ష్య వచ్చాయని అన్నారు. కట్ చేస్తే.. టీడీపీని వీడటం, టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం.. తర్వాత అదీ బీఆర్ఎస్గా రూపాంతరం చెందడం జరిగిపోయాయి. కట్ చేస్తే.. ఊ అంటే ఐటీ అని చంద్రబాబు అంటుంటారు. దానిపై కేసీఆర్ స్పందిస్తూ.. ఐటీలో బాబు పీకిందేమి లేదని హాట్ కామెంట్స్ చేశారు. అదంతా హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేక కారణం వివరించారు. కొన్ని కంపెనీలు బ్యాకప్ మెకానిజం, డిజాస్టర్ మేనెజ్ మెంట్ మెకానిజం పాటిస్తాయని తెలిపారు. ఐబీఎం కూడా అలానే చేసిందని చెప్పారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో.. భూకంపాలు తక్కువగా వచ్చే ప్రాంతం, తుఫాన్ ప్రభావం ఎక్కువ లేని ప్రాంతాన్ని సెలక్ట్ చేశారు.. అందులో హైదరాబాద్ నిలిచిందని గుర్తుచేశారు. అలా కంపెనీలు ప్రధానిని రిక్వెస్ట్ చేయగా.. హైదరాబాద్ వచ్చాయన్నారు. హైదరాబాద్ దక్కన్ పీఠభూమి అని.. అన్ని సౌకర్యాలు ఉండటంతో ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేసి.. తమ డేటాను భద్రపరిచాయని వివరించారు. అంతే తప్ప ఇందులో చంద్రబాబు పొడిచిందేమీ లేదని సెటైర్లు వేశారు.