No trial in chandra Babu case till september 18th 2023 High Court order to ACB court
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటివల విదేశాల్లో పర్యటించినప్పుడు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి(chandra Babu)ని అర్ధరాత్రిపూట అరెస్టు చేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. చంద్రబాబును ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ అంశం గురించి ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం చేసినందున.. టీడీపీ న్యాయ బృందం విజయవాడలోని స్థానిక కోర్టు న్యాయమూర్తిని రిమాండ్‌ను నిలిపివేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. దీంతోపాటు ఆరోపణలు చాలా ప్రాథమికమైనవని, తక్షణ అరెస్టును సమర్థించే ఖచ్చితమైన ఆధారాలు లేవని వాదించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.
తాజా పరిణామం ఏమిటంటే చంద్రబాబు తరపు న్యాయవాది హైకోర్టులో క్వాష్ పిటిషన్(cash pitition) దాఖలు చేయగా…కోర్టు దానిని వచ్చే మంగళవారానికి(సెప్టెంబర్ 19) వాయిదా వేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. మరోవైపు ఈ అంశంపై సీఐడీకి సెప్టెంబర్ 18లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో చంద్రబాబు నాయుడు ఇప్పట్లో బెయిల్ పై బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాదు సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ పై ఈనెల 18 వరకు విచారణ చేపట్టొద్దని ఏసీబీని కోర్టు కోరింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టు విధించిన జ్యుడిషీయల్ రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని చంద్రబాబు క్వాష్ పిటిషన్లో పేర్కొన్నారు.