బ్రెజిల్(brazil)లోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో ఓ ప్రయాణీకుల విమానం శనివారం కూలిపోయింది. దీంతో అందులో ఉన్న మొత్తం 14 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా తెలిపారు.
బ్రెజిల్(brazil)లోని ఉత్తర అమెజాన్ రాష్ట్రంలో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో 14 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ తెలిపారు. రాష్ట్ర రాజధాని మనౌస్‌కు 400 కిమీ దూరంలో ఉన్న బార్సెలోస్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో బాధితులైన 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మరణించారని అమెజాన్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
మరోవైపు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయని, సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఇంకోవైపు Manaus Aerotaxi ఎయిర్‌లైన్ కూడా ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ప్రమాదం జరిగిందని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. కానీ మరణాలు లేదా గాయాల గురించి ఎటువంటి వివరాలను అందించలేదు. మరణించిన వారిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారని కొన్ని బ్రెజిల్ మీడియా సంస్థలు చెబుతున్నాయి.