»Us Airport Officers Caught On Camera Stealing Money From Passengers Bags
Viral News: ఎయిర్ పోర్టులో చెక్ చేసే అధికారులే క్యాష్ కొట్టేశారు
ఎయిర్ పోర్టులో ప్యాసింజర్ల బ్యాగులను చెక్ చేసే అధికారులు తమ చేతివాటం చూపించారు. బ్యాగ్‌ను చెక్ చేస్తున్నట్లు నటిస్తూ అందులో ఉన్న క్యాష్‌ను దొంగలించి తమ జేబుల్లో పెట్టుకున్నారు. ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకున్నారు.
US Airport Officers Caught On Camera Stealing Money From Passengers Bags
Viral News: సాధారణంగా ఎయిర్పోర్ట్(Airport), మెట్రో(Metro) తదితర ప్రాంతాల్లో బాడీ ఫుల్ చెకప్‌తో పాటు మన దగ్గర ఉన్న అన్ని వస్తువులను కూడా క్షుణ్ణంగా అధికారులు పరిశీలిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. మన దగ్గర ఉన్న లగేజ్ బ్యాగుల(Passengers Bags)ను కూడా ఎలక్ట్రిక్ టెక్నాలజీలతో చెక్ చేస్తారు. సాధారణంగా ఇది విమానాశ్రయాల్లో ఎక్కువగా చూస్తుంటాము. అయితే ఇలా చెకింగ్ పేరిట బ్యాగుల్లో ఉన్న డబ్బులను కాజేసే ముఠా ఒక్కటి తయారైంది. అయితే వారు ఎవరో కాదు. ఎయిర్ పోర్ట్‌లో పనిచేసే చెకింగ్ సిబ్బంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో అది చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ఈ విస్తుపోయే సంఘటన అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(Miami International Airport)లో చోటుచేసుకుంది.
ఇద్దరు ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA) అధికారులు ప్రయాణీకుల బ్యాగుల్లోని డబ్బులతో పాటు విలువైన వస్తువులను కాజేస్తున్నారు. ఒక అంతార్జాతీయ పత్రికా కథనం ప్రకారం అధికారులు ఈ ఏడాది జూన్ 29న ప్రయాణీకుల బ్యాగ్ నుంచి కనీసం 600 డాలర్ల నగదును తస్కరించాడు. దీంతోపాటు ఇతర విలువైన వస్తువులను దొంగిలించారు. వీరు చేసే ఘనకార్యం సీసీలో రికార్డు కావడంతో వారిని 20 ఏళ్ల గొంజాలెజ్, 33 ఏళ్ల లాబారియస్ విలియమ్స్‌గా అధికారులు గుర్తించారు.
ఇక వీడియోను పరిశీలిస్తే ఎక్స్-రే మెషిన్‌కు వెళ్లే మార్గంలో బ్యాగులు, పర్సుల నుంచి డబ్బు తీసుకునేందుకు ఆ ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారు. ఒక పర్సులోంచి డబ్బులు తీసుకుని ఒక అధికారి తన జేబులో పెట్టుకుంటున్నారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన అధికారలకు ఈ నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు వెలుగులోకివచ్చాయి. వీరిద్దరు కలిసి రోజుకు 1,000 డాలర్ల వరకు దొంగిలించినట్లు అంగీకరించారు. దీంతో వారిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.