»Telangana Pavilion For World Food India Event 2023 Delhi
World Food Summit: వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్‌కు తెలంగాణ
ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు 2023 నవంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు జరగనుంది. అయితే ఈ సదస్సులో తెలంగాణ పెవిలియన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అందుకోసం రాష్ట్రంలోని స్టార్టప్స్, ఆయా సంస్థలు అప్లై చేసుకోవాలని సూచించారు.
Telangana pavilion for World Food India event 2023 delhi
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కీలకమైన వాటాదారులను ఒకచోట చేర్చిన ఒక ముఖ్యమైన ఈవెంట్ వరల్డ్ ఫుడ్ ఇండియాస్ తెలంగాణ సమ్మిట్‌కు రాష్ట్రం శుక్రవారం ఆతిథ్యం ఇచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమ్మిట్‌లో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మిన్హాజ్ ఆలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే ప్రపంచ ఆహార సదస్సులో తెలంగాణ తన పెవిలియన్‌ను కలిగి ఉంటుందని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేష్ రంజన్ తెలిపారు. స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలు తమ ఉత్పత్తులు, ఆవిష్కరణలను పెవిలియన్‌లో ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అయితే తెలంగాణ పెవిలియన్‌లో భాగంగా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 10, 2023 అని పేర్కొన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023 నవంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు న్యూ ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 సదస్సు జరగనుంది. భారతదేశాన్ని వరల్డ్ ఫుడ్ భౌల్ గా మార్చాలనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతోపాటు ఇతర సెగ్మెంట్లలో పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా బ్యాక్వర్డ్ లింకేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరికరాలు, ప్రాసెసింగ్ సంబంధిత R&D, కోల్డ్ చైన్ స్టోరేజ్ సొల్యూషన్లు, స్టార్ట్-అప్లు, లాజిస్టిక్ & రిటైల్ చెయిన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వాల్యూ చైన్ వంటి అనేక విభాగాలు ఉంటాయని ప్రకటించారు.
భారతీయ ఆహార సంస్కృతిని ప్రపంచానికి ప్రదర్శించడంతోపాటు దేశంలోని విభిన్న ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2017లో వరల్డ్ ఫుడ్ ఇండియా మొదటి ఎడిషన్‌ను ప్రారంభించింది. ఇందులో 800 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఉన్నారు. 30 కంటే ఎక్కువ దేశాల నుంచి భాగస్వామ్యం ఉంది. 2017లో జరిగిన కార్యక్రమంలో నెదర్లాండ్స్ భాగస్వామి దేశంగా ఉంది. ఈ సంవత్సరం అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం 2023లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ రెండవ ఎడిషన్ ‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2023’ని నవంబర్ 3 నుండి 5 వరకు న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించనుంది.