janasena party alliance with bjp in telangana assembly elections 2023
తెలంగాణలోని హైదరాబాద్‌లో శనివారం ఉదయం నుంచి నాలుగు చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సోదాలు చేపడుతోంది. దీంతోపాటు కోయంబత్తూరులో 22 చోట్ల, చెన్నైలో మూడు చోట్ల సోదాలు ప్రారంభించింది. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈరోజు రాత్రి హైదరాబాద్ రానున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలైన రాహుల్ గాంధీ, సోనియా కూడా తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఏదైనా పేలుళ్లకు ప్లాన్ చేసి ఉంటారా అనే కోణంలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అక్టోబరు 23, 2022న కోయంబత్తూరులోని ఉక్కడం వద్ద ఉన్న ఈశ్వరన్ కోవిల్ స్ట్రీట్‌లోని కొట్టై సంగమేశ్వరర్ ఆలయం సమీపంలో కారు బాంబు పేలుడు సంభవించింది. ఆ పేలుడు పరికరంతో కారు నడిపిన ISIS అనుచరుడు జమేషా ముబీన్ మరణించాడు. అయితే అతను కోయంబత్తూరు కునియాముత్తూరులోని కోవై అరబిక్‌లో కళాశాల చదువుకున్నాడని దర్యాప్తులో తేలింది. అంతేకాదు కొన్నేళ్ల క్రితం కళాశాలలో ముబీన్‌తో పాటు మరో 25 మందికి పైగా చదువుకున్నారు. దీంతో చెన్నైకి చెందిన ఎన్ఐఏ అధికారులు కోయంబత్తూర్‌లోని అరబిక్ కళాశాలలో గత నెలలో సోదాలు నిర్వహించాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఏదైనా ఆధారాలు లేదా ఆచూకీ కోసం సోదాలు చేస్తున్నారనేది తెలియాల్సి ఉంది.