ట్విట్టర్ యూజర్లు త్వరలో నెలవారీ ఫీజులు చెల్లించాల్సిందే. ఈ విషయంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను అమలు చేయనున్నట్లు తెలిపారు.
తైవాన్ తమదేనంటూ హుంకరిస్తున్న చైనా మరోసారి దుందుడుకు చర్యలకు తెరదీసింది. వందకు పైగా యుద్ధ విమానాలతో తైవాన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నించింది.
కెనడాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ హత్యతో భారత్(bharat)కు సంబంధముందని అక్కడి ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై భారత్ దౌత్యవేత్తను కెనడాలో బహిష్కరించగా..దీనిపై స్పందించిన భారత్ ఇండియాలో కెనడా దౌత్యవేత్తపై కూడా చర్యలు తీసుకున్నారు.
యుక్తవయస్సు రాకముందే తల్లిదండ్రుల సహాయంతో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన 22 ఏళ్ల గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. క్రిప్టోలో పెట్టుబడి పెట్టి దాదాపు రూ.67 లక్షలు నష్టపోయానని వెల్లడించాడు.
ఇండోబంగ్లాదేశ్ సరిహద్దులో గోల్డ్ స్మగ్లింగ్ ముఠాను BSF జవాన్లు చేధించారు. ఆ క్రమంలో ఇద్దరిని పట్టుకుని వారి నుంచి ఏకంగా 14 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కెనడా(Canada), భారత్(bharat) దేశాల మధ్య జీ20 సదస్సు తర్వాత క్రమంగా వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సోమవారం కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ(Melanie Joly) ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హతమార్చడంపై భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
లిబియాలో 20 వేల మంది చనిపోయే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. దీనితో పాటు మరణాల గణాంకాలు కూడా ఇవ్వబడ్డాయి. 11 వేల మందికి పైగా మరణించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి తాను ప్రకటించిన ఈ గణాంకాలను ఉపసంహరించుకుంది.
విశ్వరహస్యాలను చేధించేందుకు నాసా ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఒక అద్భుతాన్ని చిత్రీకరించింది. సూర్యుడు ఏర్పడుతున్నప్పుడు కూడా ఇలానే జరిగుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
బాక్టీరియా సోకిన చేప తిని ఓ మహిళా కాళ్లూచేతులు పోగొట్టుకుంది. స్థానికంగా దొరికే చేపలను వండుకొని తినింది. తరువాత అనారోగ్యం పాలు కావడంతో వైద్యులు తీవ్రంగా శ్రమించి ఆమే ప్రాణాలను కాపాడారు. తన అవయవాలను పోగొట్టుకుంది.
రెనో ఎయిర్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో చివరి రోజు విషాదసంఘటన చోటుచేసుకుంది. విమానాలు ఢీకొని ఇద్దరు పైలట్లు మృతి చెందారు.
బ్రెయిన్ క్యాన్సర్ వల్ల చాలా మంది మరణిస్తున్నారు. తాజాగా ఈ క్యాన్సర్ రావడానికి కారణమైన కణాలను అంతం చేయడానికి శాస్త్రవేత్తలు ఓ అద్భుతమైన స్ప్రేను ఉత్పత్తి చేశారు.
ట్విట్టర్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు ఇబ్బందులకు గురయ్యారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత నాలుగోసారి ఇలా వాటి సేవలు నిలిచిపోయాయని యూజర్లు ఫైర్ అవుతున్నారు.
లిబియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వరదల కారణంగా 11 వేల మందికి పైగా మరణించారు. ఇంకా 10 వేల మంది గల్లంతయ్యారు. 30 వేల మంది నిరాశ్రయులుగా మిగిలారు.
మనిషి శరంలో అతి ప్రమాదకర రసాయనాన్ని పరిశోధకులు గుర్తించారు. యూరోపియన్ల శరీరంలో ఆ కెమికల్ ఉందని, దాని వల్ల క్యాన్సర్, సంతానోత్పత్తిలో లోపం రావడం వంటివి జరుగుతాయని వెల్లడించారు.
ప్రముఖ కమ్యూనిస్టు దేశమైన చైనా(china)లో వరుసగా మంత్రులు అదృశ్యమవుతున్నారు. అయితే ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు? అధికారంలో ఉన్న అధ్యక్షుడి తీరును ప్రశ్నించినందుకే ఈ పనిచేయిస్తున్నారా? లేదా మరేదైనా కారణం ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.