X Corp Down: నిలిచిపోయిన ‘ఎక్స్’ సేవలు..ఆందోళనలో యూజర్లు
ట్విట్టర్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు ఇబ్బందులకు గురయ్యారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత నాలుగోసారి ఇలా వాటి సేవలు నిలిచిపోయాయని యూజర్లు ఫైర్ అవుతున్నారు.
ఎక్స్ కార్ప్ సేవలు నిలిచిపోవడం (X Corp Down)తో యూజర్లు ఆందోళన చెందారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (Twitter)సేవలు ఆదివారం నిలిచిపోయాయి. ట్వీట్ చేయడం, రీఫ్రెష్ చేయడం పనిచేయలేదు. దీంతో యూజర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చాలా మంది తమ టైమ్‌లైన్ కూడా చూసుకోలేకపోయారు. డౌన్ డిటెక్టర్ సైతం ఎక్స్ కార్ప్ సేవలు డౌన్ అయ్యాయయని తెలిపింది.
ట్విట్టర్ సేవల (Twitter) అంతరాయంపై పలువురు నెట్టింట ఫైర్ అవుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు డౌన్ డిటెక్టర్ (Down detector) తెలిపింది. ట్వీట్స్ చూసేవారికి కొంత ఇబ్బంది ఎదురైంది. ఇదిలా ఉంటే గత రెండు నెలల కిందట ట్విట్టర్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సేవల నిలిచిపోవడంతో దాదాపు 4 వేల మందికి పైగా పలు సమస్యలను ఎదుర్కొన్నారు.
వెబ్సైట్ (website), యాప్, లాగిన్‌లో సమస్యలు (Login Problems) ఎదుర్కొన్నట్లుగా డౌన్ డిటెక్టర్ వెల్లడించింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఇలా జరగడం ఇది నాలుగోసారి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్లంతో ఎలాన్ మస్క్ (Elon Musk)ను విమర్శిస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు.