»China Fighter Crafts Reportedly Flies Towards Taiwan
China: వందకి పైగా యుద్ధ విమానాలతో తైవాన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు చైనా యత్నం
తైవాన్ తమదేనంటూ హుంకరిస్తున్న చైనా మరోసారి దుందుడుకు చర్యలకు తెరదీసింది. వందకు పైగా యుద్ధ విమానాలతో తైవాన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నించింది.
china fighter crafts reportedly flies towards taiwan
China: తైవాన్(taiwan) తమదేనంటూ విర్రవీగుతున్న చైనా(China) మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. వందకు పైగా యుద్ధ విమానాలతో తైవాన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నించింది. చైనాకు చెందిన 103 యుద్ధ విమానాలు తమ భూభాగం దిశగా దూసుకు రావడాన్ని తాము గుర్తించినట్టు తైవాన్(taiwan) పేర్కొంది. అందులో 40 యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటినట్టు తైవాన్ రక్షణ శాఖ తెలిపింది. అదే సమయంలో చైనాకు చెందిన 9 యుద్ధ నౌకలు కూడా సముద్ర జలాల్లో దర్శనమిచ్చినట్టు వెల్లడించింది. ఇదంతా 24 గంటల వ్యవధిలో జరిగిందని తైవాన్ వివరించింది.
చైనా(China) ఈ ఆరోపణలను ఎప్పట్లాగానే ఖండించింది. మేం మధ్య రేఖను దాటాం అని చెప్పడానికి అసలు ఆ రేఖ అనేది ఉంటేనే కదా అంటూ వితండవాదం చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ దీనిపై స్పందించారు. తైవాన్ కు చైనాకు నడుమ మధ్య రేఖ అనేదే లేదని, తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమేనని పునరుద్ఘాటించారు.