అందరికీ సొంతింటి కల అనేది ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో చిన్న ఇల్లు కట్టుకోవడానికి కూడా ఎంతో డబ్బు అవసరం. డబ్బులుండి పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నా కూడా వాటికయ్యే ఖర్చు అంతా ఇంత కాదు. ఈ కారణంగానే యునైటెడ్ కింగ్ డమ్‌లో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్లాట్లను కేవలం 1 పౌండ్‌కే అమ్మేశారు. ఇది భారత కరెన్సీలో రూ.100 మాత్రమే కావడం విశేషం.
యూకేలో ఇంటి నిర్వహణ అనేది చాలా మందికి పెద్ద సమస్య అయ్యింది. లండన్, సౌత్ ఈస్ట్ వంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువైంది. ఆస్తి ధరలు, అద్దె ఖర్చులు కూడా బాగా పెరిగాయి. పెరుగుతున్న జనాభా కారణంగా అక్కడ ఇల్లు కొనాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో యూకేలోని రూ.6.6 కోట్ల విలువైన ప్లాట్లు కేవలం రూ.100లకే అమ్మేశారు. కార్న్ వాల్ కౌన్సిల్ లూయీ ప్రాంతంలోని 11 ప్లాట్ లను కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్‌కి అమ్మేశారు.