కరోనా (Corona) ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కోవిడ్-19 (Covid-19)పై శాస్త్రవేత్తలు కూడా అనేక పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా కరోనా విషయంలో మరో షాకింగ్ విషయాన్ని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. మానవుల నుంచి జింక (Deers)లకు కరోనా సోకుతోందని పరిశోధనలో తేలింది.
కోవిడ్ వైరస్ జంతువు (Animals)ల్లో ఎక్కువగా విస్తరిస్తోందని, జన్యు పరివర్తనం చెందుతోందని ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చి చెప్పారు. పరిశోధనా ఫలితాలను నేచర్ కమ్యూనికేషన్లో ప్రచురితం అయినట్లు తెలిపారు.
ఒహియోలోని 1,522 జింకల ముక్కు నుంచి స్వాబ్‌ను శాస్త్రవేత్తలు సేకరించారు. దాని ద్వారా జన్యుపరమైన విశ్లేషణ చేసి పరిశోధనల్లో ముఖ్య విషయాలను తేల్చారు. జింకల శరీరంలో 6 నుంచి 9 నెలల పాటు కోవిడ్ ఉంటుందని, దానివల్ల అవి అనారోగ్యం బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ ఆండ్రూ బోమాన్ వెల్లడించారు.