బ్యాక్టీరియాతో కరెంట్‌ను ఉత్పత్తి చేసే అద్భుత సాంకేతికతను స్విట్జర్లాండ్ పరిశోధకులు ఆవిష్కరించారు. వృథా నీటి నుంచి అధికంగా బ్యాక్టీరియా పెరుగుతుంటుంది. ఆ నీటి నుంచే కరెంటును ఉత్పత్తి చేసి శాస్త్రవేత్తలు అద్భుతం సృష్టించారు. జన్యుక్రమంలో మార్పులు చేసిన ఈకోలీ అనే బ్యాక్టీరియాను వేస్ట్ వాటర్ అంటే మురికినీరులో పెంచారు. ఆ తర్వాత దాని నుంచి విద్యుత్తును ఉప్పత్తి చేశారు.
లాసాన్నేలోని ఈపీఎఫ్‌ఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బొఘోసియన్ ఈ విషయాన్ని ప్రకటించారు. నీటిలో ఎలాంటి కెమికల్స్ కలపకుండానే ఈ విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లుగా శాస్త్రవేత్తలు తెలిపారు. తాము ఆవిష్కరించిన సాంకేతికతతో మురికి నీటిని శుద్ధి చేసి అదే టైంలో ఎక్స్ట్రాసెల్యులార్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ (ఈఈటీ) విధానంలో విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చని పరిశోధకులు వెల్లడించారు.