»Canadian Prime Minister Justin Trudeau Refuses Indias Help
Justin trudeau: భారత్ సాయం వద్దన్న కెనడా ప్రధాని..ప్రతిపక్షాల ఆరోపణలు!
జీ20 సదస్సులో భాగంగా భారత్ వచ్చిన కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో(justin trudeau)కు ఓ వింత అనుభవం ఎదురైంది. సమావేశాల తర్వాత అతను తిరిగి తన దేశానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వచ్చిన ఫ్లైట్లో సాంకేతిక సమస్య కారణంగా రెండు రోజులు ఇక్కడే ఉండిపోయారు. అంతేకాదు ఇండియా(india) సాయం చేస్తామని చెప్పినా కూాడా తిరస్కరించారు.
Canadian Prime Minister justin trudeau refuses India's help
ఇటివల జీ20 సమావేశాల్లో భాగంగా కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో(justin trudeau) భారత్ వచ్చారు. అయితే సదస్సు తర్వాత అతను తిరిగే వెళ్లే క్రమంలో అతను వచ్చిన విమానం సాంకేతిక లోపంతో 36 గంటలకు పైగా ఢిల్లీలో చిక్కుకుపోయింది. ఈ అంశంపై స్పందించిన భారత ప్రభుత్వం ట్రూడోను వారి దేశానికి తరలించేందుకు భారత అధికారి విమానం ఎయిర్ ఇండియా వన్ సేవలను అందిస్తామని చెప్పింది. కానీ అందుకు కెనడా ప్రధాని ఒప్పుకొలేదు. సున్నీతంగా తిరస్కరించి(refuse) తమ దేశం నుంచి వచ్చే మరో ఫ్లైట్ కోసం వేచిచూస్తామని చెప్పారు. ఎయిర్ ఇండియా వన్ సేవలను ఇండియా 1 అని కూడా పిలుస్తారు. ఇది భారత వైమానిక దళంచే నిర్వహించబడుతుంది. ఇది ప్రధానంగా భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి కోసం మాత్రమే ఉపయోగిస్తారు. కానీ అలాంటి విలువైన సేవలను సైతం కెనడా ప్రధాని స్వీకరించలేదు.
ఆ క్రమంలో కెనడా నుంచి వచ్చే మరో విమానం కూడా పలు కారణాలతో లండన్ కు మళ్లీంచారు. ఆ నేపథ్యంలో ఇక్కడకు వచ్చిన మొదటి ఫ్లైట్ రిపేర్ కావడం ఆయన వారి దేశానికి చేరుకున్నారు. అయితే జీ20 సదస్సు సందర్భంగా పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించిన మోదీ.. ట్రూడోతో ఒక్కసారి కూడా సమావేశాలు నిర్వహించలేదు. మరోవైపు కెనడాలో భారత వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాల గురించి పీఎం మోడీ తన వాదనలను వినిపించారు. అలాంటివి ఎదుర్కోవడంలో రెండు దేశాలు సహకరించడం చాలా అవసరమని గుర్తు చేశారు. ఈ అంశంపై ట్రూడో స్పందిస్తూ కెనడా ఎల్లప్పుడూ “భావ ప్రకటనా స్వేచ్ఛ”ను కాపాడుతుందన్నారు. అదే సమయంలో హింసను నిరోధించడానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. మరోవైపు భారత్(bharat), కెనడా(canada) మధ్య జరిగిన ఒప్పందాల అంశంపై అక్కడి ప్రతిపక్ష నేతలు కెనడా ప్రధానిపై ఆరోపణలు చేశారు. కీలకమైన దౌత్య ఒప్పందాలు చేసుకోవడంలో ట్రూడో విఫలమయ్యారని విమర్శించారు.