»A Shock To Chatgpt Popularity Is Decreasing Day By Day
ChatGPT: చాట్‌జీపీటీకి షాక్.. రోజురోజుకీ తగ్గుతున్న జనాదరణ
చాట్‌జీపీటీ(ChatGPT) వీక్షించేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని సిమిలర్ వెబ్ సంస్థ వెల్లడించింది. మార్చి నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో దీని వీక్షణ సమయం మరింత తగ్గిందని తెలిపింది.
చాట్‌జీపీటీ (ChatGPT) వచ్చాక చాలా మంది ఉద్యోగాలు ఊడిపోతాయని భయపడ్డారు. కొందరైతే మెల్లగా చాట్‌జీపీటీపై ఆధారపడటం ప్రారంభించేశారు. దానికి పోటీ ఏది లేదని, రాదని కూడా మరికొందరు వాదించారు. అయితే తాజా సమాచారం ప్రకారం చాట్‌జీపీటీకి క్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది.
వరుసగా మూడో నెల చాట్‌జీపీటీ(ChatGPT) వీక్షించేవారి సంఖ్య క్షీణిస్తూ వస్తోంది. ఈ విషయాలను సిమిలర్ వెబ్ (Similar Web) సంస్థ వెల్లడించింది. గత నెలతో పోలిస్తే ఆగస్టులో 3.2 శాతం వీక్షించే వారి సంఖ్య 3.2 శాతం క్షీణించినట్లు నమోదైంది. డెస్క్‌టాప్ (Desktops)తో పాటుగా మొబైల్ యూజర్లు (Mobile Users) సైతం ఈ చాట్‌జీపీటీకి దూరమవుతూ వస్తున్నారు.
మూడు నెలల్లో 10 శాతం మంది వీక్షించడం తగ్గిందని తెలుస్తోంది. సిమిలర్ వెబ్ సైట్ (Similar Website)లో మార్చిలో వీక్షణ సమయం 8.7 నిమిషాలు ఉండగా అది ఆగస్టు నాటికి 7 నిమిషాలకు చేరినట్లు నమోదైంది. దీంతో కార్పొరేట్ సంస్థల్లో కొందరు ఆనందం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ఆందోళన చెందుతున్నారు.