RRR : మన దగ్గర ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు.. కానీ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకొని.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత మాత్రం రాజమౌళికే సొంతం. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్‌కు పునాది వేసి.. ఒక్కసారిగా యావత్ ప్రపంచం.. తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాడు.
ప్రపంచ కుబేరుడు.. టెస్లా, ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్(Elon Mask) ట్విట్టర్‌లో 'గాడ్'(god)ని బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. దేవుడికి ట్విట్టర్ ఖాతా(twitter account) ఉందా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
అంతర్జాతీయ టాప్ 10 కుబేరుల్లో (World’s Top 10 Billionaires list) మన దేశం నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి (Reliance Mukesh Ambani) మాత్రమే చోటు దక్కింది. హూరన్ గ్లోబర్ రిచ్ లిస్ట్ (2023 M3M Hurun Global Rich List) లో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి (Adani Gautam Adani) చోటు దక్కలేదు.
బ్రిటన్ దేశంలో ద్రవ్యోల్బణం(uk inflation) ఫిబ్రవరిలో నాలుగు నెలల్లో మొదటిసారిగా 10.4 శాతానికి(10.4%) చేరుకుంది. ఈ క్రమంలో గురువారం వడ్డీ రేట్లను పెంచాలని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(bank of england)పై ఒత్తిడి పెరగనున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక ఇంధన ధరలు, నిత్యవసరాల రేట్లు పెంపు సహా పలు అంశాలు ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు.
పాకిస్తాన్ లోని న్యూస్ క్యాస్టర్ మాష్రిక్ టీవీ.. బ్రేకింగ్ వార్తలు చదివే సమయంలోనే అక్కడ ప్రకంపనలు వచ్చాయి. దీంతో టీవీ న్యూస్ యాంకర్ వార్తలు చదువుతుండగా అతను నిలుచున్న స్థానం సహా స్టూడియో అంతా కంపిస్తున్నట్లుగా వీడియోలో చూడవచ్చు.
ఢి ల్లీ – ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో మంగళవారం రాత్రి 10.22 నిమిషాలకు భూమి కంపించింది (delhi earthquake news). ప్రకంపనలు (tremors in Delhi, North India) రావడంతో ప్రజలు ఒక్కసారిగా తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.6గా నమోదయింది. నివేదికల ప్రకారం భూకంప కేంద్రం ఆప్గనిస్తాన్ లోని హిందూ కుష్ ప్రాంతంలో (epicenter of the earthquake was the Hindu Kush region ...
పాట్నా రైల్వే స్టేషన్ లో (Patna railway station) పోర్న్ వీడియో అంశంపై పోర్న్ స్టార్ కేంద్ర లస్ట్ స్పందించింది. ఈమె అమెరికాకు చెందిన ఫోర్నోగ్రాఫిక్ ఫిల్మ్ నటి. 1978లో యూఎస్ లోని మిచిగాన్ మాడిసన్ హైట్స్ లో జన్మించింది.
ఆస్ట్రేలియన్ - అమెరికన్ బిలియనీర్, మీడియో మొఘల్ రూపర్ట్ మర్దోక్ (Media Baron Rupert Murdoch) తన 92 ఏళ్ల వయస్సులో అయిదో పెళ్ళికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలైన మాజీ శాన్ ఫ్రాన్ పోలీస్ చాప్లాయిన్ యాన్ లెస్లీ స్మిత్ (Ann Lesley Smith) ను వివాహం చేసుకోనున్నాడు.
గత కొన్ని రోజుల నుంచి కార్పొరేట్ సంస్థల్లో లేఆఫ్స్(Layoffs) కింద ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ టెక్ సంస్థలు ఉద్యోగాల కోతను కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, అమెజాన్(Amazon) వంటి పెద్ద కంపెనీలు భారీ సంఖ్యలో తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. ప్రముఖ సెర్చింజన్ గూగుల్(Google) మాతృ సంస్థ అయిన అల్ఫాబెట్ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులన...
MS Dhoni : క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఒక్కో టీమ్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని కేవలం ధోనీ కోసం చూసేవారు చాలా మంది ఉన్నారు. అయితే... మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ కెరీర్ విషయంలో తాజాగా మరో అప్ డేట్ వచ్చింది.
చైనాలోను ప్రధాని మోడీకి పాపులారిటీ ఉన్నట్లుగా వెల్లడైంది. అసాధారణ సామర్థ్యాలు కలిగిన వ్యక్తి అంటూ చైనీస్ నెటిజన్లు తెగ పొగుడుతున్నట్లు అమెరికాకు చెందిన మ్యాగజైన్ ది డిప్లొమాట్ వెల్లడించింది.
ఈమధ్య కాలంలో ఘోర రోడ్డు ప్రమాదాలు(Road Accidents) చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం బంగ్లాదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం(Accident)లో 17 మంది దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు గోడను ఢీకొట్టి కాలువలోకి పడిపోయింది. ఈ ఘటనలో మరో 30 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
దక్షిణ ఈక్వెడార్(Ecuador), ఉత్తర పెరూ(Peru)లో శనివారం బలమైన భూకంపం(earthquake) సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, 380 మందికిపైగా గాయపడ్డారని అక్కడి మీడియా తెలిపింది. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది(rescue employees) ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల క్రింద చిక్కుకున్నవారిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
పాకిస్తాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దిగువ కోహిస్థాన్ లోని పట్టాన్ ప్రాంతంలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. ఈ ఘటనలో 10 మంది(10 Died) సజీవదహనమయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ఓ మహిళ, అత్త, ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు దుర్మరణం చెందారు. కోహిస్థాన్ లో శుక్రవారం ఉదయం 4 గంటలకు లాంతరు నుంచి చెలరేగిన మంటలు 10 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి.
కొవిడ్(Covid) పుట్టుకపై అనేక రకాల పరిశోధనలు జరిగాయి. ప్రపంచాన్ని కుదిపేసిన ఈ వైరస్ మూలాలు కనుగొనేందుకు పరిశోధకులు ఇంకా తమ పరిశోధనలను సాగిస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా(Corona) పుట్టుకపై మరో థియరీ అనేది బయటకి వచ్చింది. అంతర్జాతీయ వైరస్(Virus) నిపుణుల బృందం ఈ కొత్త విషయాలన్ని వెలుగులోకి తెచ్చింది. కరోనా వైరస్(Corona Virus) అనేది రక్కూన్ డాగ్స్ అనే జంతువుల నుంచి వ్యాపించినట్లు పరిశోధకులు స్పష్టం చేస...