»Inflation Hits 10 4 In Uk Increase Petrol And Goods Prices
UKలో 10.4%కి చేరిన ద్రవ్యోల్బణం..భగ్గుమంటున్న ధరలు
బ్రిటన్ దేశంలో ద్రవ్యోల్బణం(uk inflation) ఫిబ్రవరిలో నాలుగు నెలల్లో మొదటిసారిగా 10.4 శాతానికి(10.4%) చేరుకుంది. ఈ క్రమంలో గురువారం వడ్డీ రేట్లను పెంచాలని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(bank of england)పై ఒత్తిడి పెరగనున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక ఇంధన ధరలు, నిత్యవసరాల రేట్లు పెంపు సహా పలు అంశాలు ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు.
బ్రిటన్ దేశంలో ద్రవ్యోల్బణం(uk inflation)ఫిబ్రవరిలో నాలుగు నెలల్లో మొదటిసారిగా పెరిగింది. వినియోగదారుల ధరల సూచీ 12 నెలల్లో ఫిబ్రవరి వరకు 10.1% ఉన్న ద్రవ్యోల్బణం.. ఒక్కసారిగా 10.4%కి ఎగబాకింది. ఇంధన ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడం సహా పలు అంశాలు దీని పెరుగుదలకు కారణమని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ బుధవారం తెలిపింది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే ఆర్థికవేత్తలు ఈ సంవత్సరం చివర్లో ధరలు వేగంగా పడిపోతాయని ఆశిస్తున్నప్పటికీ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(england) లక్ష్యం 2% కంటే ద్రవ్యోల్బణం ఐదు రెట్లు ఎక్కువగా నమోదైంది.
ఈ నేపథ్యంలో గురువారం వడ్డీ రేట్లను పెంచాలా వద్దా అని నిర్ణయించినప్పుడు గ్లోబల్ బ్యాంకింగ్(global banking) పతనం నేపథ్యంలో ఆందోళనలు సహా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాల్సిన అవసరాన్ని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేయనుంది. డిసెంబర్ 2021 నుంచి బ్యాంక్ వరుసగా 10 రేట్ల పెంపుదలకు ఆమోదం తెలిపింది. ఆ క్రమంలో కీలక బ్యాంక్ రేటును 4%కి పెంచింది.
ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(bank of england) రేట్లను గురువారం కనీసం పావు శాతం పెంచుతుందని భావిస్తున్నట్లు CMC మార్కెట్స్ UK ప్రధాన విశ్లేషకుడు మైఖేల్ హ్యూసన్ అన్నారు. ధరల పెరుగుదల ఈ కొలతపై పనిచేయడానికి 4% బేస్ రేటు సరిపోదన్నారు. ఈ నేపథ్యంలో గురువారం రేట్లను పెంచడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌పై ఒత్తిడి తీవ్రంగా పడుతుందన్నారు.