»Mukesh Ambani Pips Gautam Adani As Richest Indian
Hurun Global Rich List: భారత కుబేరుడు అంబానీయే, లిస్ట్ లో లేని అదానీ
అంతర్జాతీయ టాప్ 10 కుబేరుల్లో (World’s Top 10 Billionaires list) మన దేశం నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి (Reliance Mukesh Ambani) మాత్రమే చోటు దక్కింది. హూరన్ గ్లోబర్ రిచ్ లిస్ట్ (2023 M3M Hurun Global Rich List) లో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి (Adani Gautam Adani) చోటు దక్కలేదు.
అంతర్జాతీయ టాప్ 10 కుబేరుల్లో (World’s Top 10 Billionaires list) మన దేశం నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి (Reliance Mukesh Ambani) మాత్రమే చోటు దక్కింది. హూరన్ గ్లోబర్ రిచ్ లిస్ట్ (2023 M3M Hurun Global Rich List) లో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి (Adani Gautam Adani) చోటు దక్కలేదు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) కథనం అనంతరం అదానీ గ్రూప్ సంపద అంతకంతకూ పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో అదానీ హూరున్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ 140 బిలియన్ డాలర్లకు పైగా ఆవిరయింది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ కు ముందు అదానీ ప్రపంచంలోనే రెండో సంపన్నుడిగా నిలిచారు. ఇక అంబానీ, భారత్ తో పాటు ఆసియా కుబేరుడిగా నిలిచి, ప్రపంచ టాప్ 10లో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. ఆయన నికర సంపద 82 బిలియన్ డాలర్లుగా ఉంది. అంబానీ సంపద ఏడాది క్రితం కంటే 20 శాతం తగ్గినప్పటికీ, అదానీ సంపద అంతకంటే ఎక్కువగా తగ్గడంతో మళ్లీ దేశీయ అగ్ర కుబేరుడిగా నిలిచారు. అంబానీ సంపద గత ఏడాది 21 బిలియన్ డాలర్లు తగ్గింది. తాజా జాబితాలో అదానీ ఫ్యామిలీ 23వ స్థానంలో నిలిచింది. వీరి ఫ్యామిలీ 28 బిలియన్ డాలర్లు నష్టపోయారు. 2022-23లో వారానికి రూ.3వేల కోట్ల చొప్పున నష్టపోయారని అంచనా. గత పదేళ్లలో అంబానీ సంపద 356 శాతం, అదానీ సంపద 1225 శాతం పెరిగాయి.
అత్యధిక సంపదను పోగొట్టుకున్న వారిలో అదానీ 6, అంబానీ 7వ స్థానంలో ఉన్నారు. భారత్ కుబేరుల జాబితాలో అంబానీ, అదానీలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న సైరస్ పూనావాలా సంపద మాత్రం 4 శాతం డాలర్లు పెరిగి 27 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. ప్రపంచంలోనే హెల్త్ కేర్ బిలియనీర్ సైరస్. హెచ్సీఎల్ శివ్ నాడర్ సంపద 7 శాతం తగ్గి 26 బిలియన్ డాలర్లకు, లక్ష్మీ మిట్టల్ సంపద 20 శాతం తగ్గి 20 బిలియన్ డాలర్లకు తగ్గింది. గత అయిదేళ్లుగా భారత్ లో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచంలో భారత్ బిలియనీర్ల వాటా 8 శాతంగా ఉంది. హూరన్ జాబితాలో అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశాల్లో అమెరికా, చైనా, భారత్ వరుసగా మూడుస్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది భారత కుబేరులు 215 ఉండగా, ఈసారి 187కు తగ్గింది. ఇందులో ముంబై నుండి 66, ఢిల్లీ నుండి 39, బెంగళూరు నుండి 21 మంది ఉన్నారు. భారత్ కుబేరులు వరుసగా అంబానీ, అదానీ, సైరస్ పూనావాలా, శివ్ నాడర్, లక్ష్మీ మిట్టల్, ఎస్పీ హిందూజా, దిలీప్ షాంఘ్వీ, రాధాకిషన్ దమానీ, కుమార్ మంగళం బిర్లా, ఉదయ్ కొటక్ ఉన్నారు.
ఈ ఏడాది అత్యధికంగా సంపదను నష్టపోయింది జెఫ్ బెజోస్. ఏడాది కాలంలో అతని నికర సంపద 70 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇది అంబానీ, అదానీ పోగొట్టుకున్న సంపద కంటే అధికం. అయినప్పటికీ రెండో స్థానంలోనే కొనసాగుతున్నారు. బెజోస్ సంపద 188 బిలియన్ డాలర్లు ఉంది. ప్రపంచ టాప్ 10 కుబేరుల విషయానికి వస్తే ఎలాన్ మస్క్ (205 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్ (188 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ అర్నాల్ట్, బిల్ గేట్స్ (124 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్ (119 బిలియన్ డాలర్లు), సెర్జీ బ్రిన్ (116 బిలియన్ డాలర్లు), లారీ పేజ్ (116 బిలియన్ డాలర్లు), స్టీవ్ బాల్మర్ (107 బిలియన్ డాలర్లు), ముఖేష్ అంబానీ (103 బిలియన్ డాలర్లు), బెర్ట్రాండ్ ప్యూచ్ ((102 బిలియన్ డాలర్లు) ఉన్నారు.