»Video Of Tv Anchor Reading News As Camera Trembles During Earthquake Goes Viral
Earthquake News: భూమి కంపించి, స్టూడియో వణికినా.. యాంకర్ ధైర్యంగా…
పాకిస్తాన్ లోని న్యూస్ క్యాస్టర్ మాష్రిక్ టీవీ.. బ్రేకింగ్ వార్తలు చదివే సమయంలోనే అక్కడ ప్రకంపనలు వచ్చాయి. దీంతో టీవీ న్యూస్ యాంకర్ వార్తలు చదువుతుండగా అతను నిలుచున్న స్థానం సహా స్టూడియో అంతా కంపిస్తున్నట్లుగా వీడియోలో చూడవచ్చు.
ఆఫ్గనిస్తాన్ లోని హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో మంగళవారం సంభవించిన భూకంప ప్రభావం ఆ దేశంతో పాటు పాకిస్తాన్, భారత్, చైనా, తుర్కెమినిస్తాన్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్ లలోను (Turkmenistan, India, Kazakhstan, Pakistan, Tajikistan, Uzbekistan, China, Afghanistan, and Kyrgyzstan) తదితర దేశాల్లో ప్రభావం చూపింది. మన దేశంలో ఉత్తరాదిన ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో భూప్రకంపనల కారణంగా రాత్రంతా నిద్రలేకుండా జాగారం చేశారు చాలామంది. భూకంపానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
పాకిస్తాన్ లోని న్యూస్ క్యాస్టర్ మాష్రిక్ టీవీ.. బ్రేకింగ్ వార్తలు చదివే సమయంలోనే అక్కడ ప్రకంపనలు వచ్చాయి. దీంతో టీవీ న్యూస్ యాంకర్ వార్తలు చదువుతుండగా అతను నిలుచున్న స్థానం సహా స్టూడియో అంతా కంపిస్తున్నట్లుగా వీడియోలో చూడవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తాను నిలుచున్న చోట భూమి కంపిస్తున్నప్పటికీ సదరు యాంకర్ ధైర్యంగా తాను వార్తలు చదువుకుంటూనే వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
A local Pashto TV channel Mahshriq TV during the earthquake. Brave of the anchor to keep his calm. But shows the impact of the earthquake. #Peshawar#Pakistanpic.twitter.com/7h3FOxBvtF
జమ్ము కాశ్మీర్ లో డాక్టర్ ప్రకంపనల సమయంలోనే ఆపరేషన్ చేస్తున్న వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. ట్రెమర్స్ వచ్చిన సమయంలో అత్యవసరంగా ఆపరేషన్ చేయవలసి వచ్చింది. డాక్టర్లకు, హాస్పిటల్ సిబ్బందికి నెటిజన్లు ఫిదా అయ్యారు.
J&K: Emergency LSCS was going-on at SDH Bijbehara Anantnag during which strong tremors of #Earthquake were felt. Kudos to doctors and staff of SDH Bijbehara who conducted the LSCS smoothly & all are safe pic.twitter.com/g7mUTe2sqf
భూకంప కేంద్రం ఆప్గనిస్తాన్ లోని హిందూ కుష్ ప్రాంతంలో (epicenter of the earthquake was the Hindu Kush region in Afghanistan) గుర్తించారు. భూకంప కేంద్రం ఆప్గన్ లోని పాయిజాబాద్ కు ఆగ్నేయంగా 133 కిలో మీటర్ల దూరంలో, 180 కిలో మీటర్ల లోతున గుర్తించారు. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్, జీలం, స్వాత్ తదితర ప్రాంతాల్లో 6.8 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రభావం వివిధ దేశాల పైన కనిపించింది. కానీ ఆయా దేశాల్లో ఆస్తి లేదా ప్రాణ నష్టం కనిపించలేదు. ఆఫ్గన్, పాక్ లో మాత్రం పన్నెండు మంది వరకు మృత్యువాత పడినట్లుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత 6.6గా నమోదయింది.