»Amazon Announces Second Round Of Layoffs Cutting 9000 Jobs In Various Departments
AMAZON: అమెజాన్లో మరో 9 వేల ఉద్యోగాల కోత
గత కొన్ని రోజుల నుంచి కార్పొరేట్ సంస్థల్లో లేఆఫ్స్(Layoffs) కింద ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ టెక్ సంస్థలు ఉద్యోగాల కోతను కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, అమెజాన్(Amazon) వంటి పెద్ద కంపెనీలు భారీ సంఖ్యలో తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. ప్రముఖ సెర్చింజన్ గూగుల్(Google) మాతృ సంస్థ అయిన అల్ఫాబెట్ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది.

తాజాగా మరోసారి అమెజాన్(Amazon) తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రెండో దశలో 9000 మంది ఉద్యోగుల(Employes)ను తొలగిస్తున్నట్లుగా అమెజాన్ వెల్లడించింది. ఈ విషయాన్ని అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ స్పష్టం చేశారు. సోమవారం అమెజాన్ ఉద్యోగులకు మెమో పంపించింది.
ఇదివరకే 18 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్(Amazon) జనవరి నెలలో తెలిపింది. ఇప్పుడు దానికి అదనంగా మరో తొమ్మిది వేల మందిని తొలగించేందుకు సిద్ధమైంది. అమెజాన్ చరిత్రలోనే ఇది రెండో అతి పెద్ద లేఆఫ్(Layoffs) కావడం విశేషం. అయితే అవసరాల మేరకు కొన్ని ప్రాంతాల్లో కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నట్లు అమెజాన్ ప్రకటించింది.