ADB: ఇచ్చోడ మండలంలోని ఇండోర్ స్టేడియం పునప్రారంభించాలని కోరుతూ MLA అనిల్ జాదవ్‌ను కలిసి మండలవాసులు గురువారం వినతి పత్రం అందజేశారు. నిరుపయోగంలో ఉన్న స్టేడియంను చెడు కార్యక్రమాలకు వాడుతున్నారని ఎమ్మెల్యేతో తెలియజేశారు. దానిని ఉపయోగంలోకి తీసుకువచ్చి యువకులకు మేలు జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు.