Fire Accident: ఘోరం..అగ్ని ప్రమాదంలో 10 మంది సజీవదహనం
పాకిస్తాన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దిగువ కోహిస్థాన్ లోని పట్టాన్ ప్రాంతంలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. ఈ ఘటనలో 10 మంది(10 Died) సజీవదహనమయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ఓ మహిళ, అత్త, ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు దుర్మరణం చెందారు. కోహిస్థాన్ లో శుక్రవారం ఉదయం 4 గంటలకు లాంతరు నుంచి చెలరేగిన మంటలు 10 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి.

భారీ మంటల(Huge Fires) కారణంగా మహ్మద్ నవాబ్ కు చెందిన ఓ చెక్క ఇల్లు(House), పశువుల పాక పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబీకులను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారందరూ మరణించినట్లు వైద్యులు(Doctors) వెల్లడించారు. చనిపోయిన వారిలో మహ్మద్ నవాబ్ భార్య చబ్బర్ బీబీ, ఆయన తల్లి జాహిదా బీబీ, ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అగ్ని ప్రమాదం(Fire Accident)లో పశువులన్నీ కూడా చనిపోయాయి.
రెస్క్యూ సిబ్బంది(Rescue Team) సంఘటనా స్థలానికి సమయానికి చేరుకోకపోవడం వల్లే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్క్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు, స్థానికులు హైవేపై మృతదేహాలతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ముహమ్మద్ ఆజం ఖాన్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.