»Revanth Reddy Said Another Unemployed Victim Of Kcrs Rule Is Died In Telangana
Revanth Reddy: కేసీఆర్ రాక్షస పాలనలో మరో నిరుద్యోగి బలి
తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) రాక్షస పాలనతో రాష్ట్రంలో మరో నిరుద్యోగి బలయ్యాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్ -1కు ప్రిపేరైన సిరిసిల్లకు(sircilla telangana) చెందిన నవీన్ కుమార్ తాజా లీకేజీ పరిణామాలతో మనస్థాపానికి గురై శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణ సీఎం కేసీఆర్(cm kcr) రాక్షస పాలనతో రాష్ట్రంలో మరో నిరుద్యోగి బలయ్యాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్ -1 కు ప్రిపేరైన సిరిసిల్లకు(sircilla telangana) చెందిన నవీన్ కుమార్ తాజా లీకేజీ పరిణామాలతో మనస్థాపానికి గురై శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్(kcr)పై హత్యనేరం కింద కేసు పెట్టాలని రేవంత్ అన్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వారి ఫ్యామిలీకి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని సూచించారు. ఈ క్రమంలో నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు. మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని.. పోరాటం చేద్దామని తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా వెల్లడించారు.
ఈ పోస్టు చూసిన పలువురు కేసీఆర్ పాలన వద్దురా నాయనా అంటూ కామెంట్లు(comments) చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం TSPSC ఛైర్మన్ ను మార్చాలని కోరుతున్నారు. అనేక మంది ఉద్యోగార్థులు వారు చేస్తున్న పనులను పక్కన పెట్టి రాష్ట్రంలో వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవతుంటే..కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం ఉద్యోగులను ఆగం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్(TSPSC Paper Leak) వ్యవహారంలో మరికొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిబ్రవరి 27న రాజశేఖర్ పేపర్ కాపీ చేయగా.. అదే తేదీన ప్రవీణ్ కు ఇచ్చాడు. ఇందులో గ్రూప్-1 పరీక్ష పేపర్‌తో పాటు జూలైలో జరగనున్న జూనియర్ లెక్చరర్ పరీక్ష ప్రశ్నపత్రం కూడా ఉన్నట్లు CIT విచారణలో వెల్లడైంది (అందుకే కమిషన్ పరీక్షలను వాయిదా వేసింది). అప్పుడు ప్రవీణ్ రేణుకకు పేపర్లు అమ్మాడు. అదే సమయంలో ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంపై సిట్ విచారణ జరుపుతోంది. సెక్రటరీకి పీఏగా వ్యవహరించడం వల్లే గ్రూప్-1 పరీక్ష పేపర్ కొట్టేసినట్లు సిట్ నిర్ధారించింది.
రాజశేఖర్ TSPSCలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నారు. అయితే.. గతంలో టెక్నికల్ సర్వీస్‌లో పనిచేస్తున్న రాజశేఖర్ కావాలనే డిప్యుటేషన్‌పై వచ్చాడు. కంప్యూటర్ను హ్యాక్ చేసి పాస్వర్డ్ చోరీకి గురైనట్లు సిట్ అనుమానిస్తోంది. విధుల్లో చేరిన తర్వాత.. ప్రవీణ్‌తో రాజశేఖర్ సంబంధాలు కొనసాగించాడు. దాదాపు ఐదు పరీక్ష పేపర్లను పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ప్రవీణ్ కు ఇచ్చాడు. మరోవైపు పాస్వర్డ్ ఎలా బయటకు వచ్చిందన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. శంకర్ లక్ష్మి అనే ఉద్యోగి డైరీ నుంచి తనకు పాస్వర్డ్ వచ్చిందని ప్రవీణ్ చెబుతున్నాడు. అయితే డైరీలో పాస్వర్డ్ రాయలేదని చెప్పింది. ఈ తరుణంలో శంకర్ లక్ష్మి పాత్రపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులకు కోర్టు ఆరు రోజుల కస్టడీ విధించింది.