ల్లీ – ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో మంగళవారం రాత్రి 10.22 నిమిషాలకు భూమి కంపించింది (delhi earthquake news). ప్రకంపనలు (tremors in Delhi, North India) రావడంతో ప్రజలు ఒక్కసారిగా తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.6గా నమోదయింది. నివేదికల ప్రకారం భూకంప కేంద్రం ఆప్గనిస్తాన్ లోని హిందూ కుష్ ప్రాంతంలో (epicenter of the earthquake was the Hindu Kush region in Afghanistan) ఉంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. ఇక్కడి భూకంప ప్రభావం ఢిల్లీ – ఎన్సీఆర్ తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల పైన కనిపించింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్ము కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ లలో (Uttar Pradesh, Himachal Pradesh, Jammu and Kashmir and Punjab) పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. డైనింగ్ టేబుల్స్, ఫ్యాన్ ఊగాయని, టీవీ, సోఫా కదిలాయని దీంతో తాము బయటకు వచ్చామని పలువురు చెబుతున్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. నోయిడాలో జనాలు అందరూ రాత్రంతా బయటే ఉండిపోయారు.
ఆప్గనిస్తాన్ లోని హిందూ కుష్ ప్రాంతంలో మంగళవారం రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు భూకంపం సంభవించింది. ఆ దేశంతో పాటు చుట్టుపక్కల పలు దేశాల పైన దీని ప్రభావం కనిపించింది. తుర్కెమినిస్తాన్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్ లలోను (Turkmenistan, India, Kazakhstan, Pakistan, Tajikistan, Uzbekistan, China, Afghanistan, and Kyrgyzstan) భూమి కంపించింది. ఆప్గన్ పొరుగునే ఉన్న పాక్, భారత్ లోని ఉత్తరాది రాష్ట్రాలపై ప్రభావం కనిపించింది. ఆప్గన్ లో దీని తీవ్రత 6.6గా నమోదింది. భూకంప కేంద్రం ఆప్గన్ లోని పాయిజాబాద్ కు ఆగ్నేయంగా 133 కిలో మీటర్ల దూరంలో, 180 కిలో మీటర్ల లోతున గుర్తించారు. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్, జీలం, స్వాత్ తదితర ప్రాంతాల్లో 6.8 తీవ్రతతో భూమి కంపించింది. పాకిస్తాన్ లోని రావల్పిండి మార్కెట్ లో తొక్కిసలాట జరిగింది. భూకంపం కారణంగా పాకిస్తాన్, ఆఫ్గన్ లలో తొమ్మిది మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది.