»Media Baron Rupert Murdoch To Marry For The Fifth Time
Murdoch 5th Marriage: 92 ఏళ్ల వయస్సులో 65 ఏళ్ల మహిళతో 5వ పెళ్లి
ఆస్ట్రేలియన్ - అమెరికన్ బిలియనీర్, మీడియో మొఘల్ రూపర్ట్ మర్దోక్ (Media Baron Rupert Murdoch) తన 92 ఏళ్ల వయస్సులో అయిదో పెళ్ళికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలైన మాజీ శాన్ ఫ్రాన్ పోలీస్ చాప్లాయిన్ యాన్ లెస్లీ స్మిత్ (Ann Lesley Smith) ను వివాహం చేసుకోనున్నాడు.
ఆస్ట్రేలియన్ – అమెరికన్ బిలియనీర్, మీడియో మొఘల్ రూపర్ట్ మర్దోక్ (Media Baron Rupert Murdoch) తన 92 ఏళ్ల వయస్సులో అయిదో పెళ్ళికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలైన మాజీ శాన్ ఫ్రాన్ పోలీస్ చాప్లాయిన్ యాన్ లెస్లీ స్మిత్ (Ann Lesley Smith) ను వివాహం చేసుకోనున్నాడు. ముర్దోక్ ఓ పత్రికతో మాట్లాడుతూ… తాను చాలా భయపడ్డానని, ఆమెతో ప్రేమలో పడేందుకు భయమేసిందని, కానీ ఇది తన చివరి వివాహం అవుతుందని తనకు తెలుసునని, ఇప్పటికి తాను సంతోషంగా ఉన్నానని అన్నాడు. ఆయన తన నాలుగో భార్య జెర్రీ హాల్ తో విడాకులు తీసుకొని కనీసం ఏడు నెలలు కూడా కాలేదు. అంతలోనే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ పెళ్లి ప్రకటన చేశారు. మార్చి 17వ తేదీన న్యూయార్క్‌లోని ఓ హోటల్ లో వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.
లెస్లీ స్మిత్ భర్త చెస్టర్ స్మిత్ కూడా ఓ వ్యాపారవేత్త. అతను కంట్రీ వెస్టర్న్ సింగర్, రేడియో అండ్ టీవీ ఎగ్జిక్యూటివ్. పదిహేను సంవత్సరాల క్రితం 2008లో అతను చనిపోయారు. అప్పటి నుండి ఒంటరిగా ఉంటోంది. ఇటీవల మర్దోక్ చేసిన పెళ్లి ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ఆయనతో జీవితం పంచుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నది. ఈ సమ్మర్ లో పెళ్లి చేసుకోనున్నారు. మిగతా జీవితాన్ని కలిసి జీవించాలనుకుంటున్నట్లు ముర్దోక్ చెప్పారు. వారు తమ జీవితాన్ని కాలిఫోర్నియా, యూకే, మోంటానా, న్యూయార్క్ లలో గడపనున్నారు.
మర్దోక్ మొదటిసారి ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ పాట్రీషియా బుకర్ (Patricia Booker)ను 1956లో వివాహం చేసుకున్నారు. వీరు 1967 వరకు కలిసి ఉన్నారు. అనంతరం విడిపోయారు. వీరికి
ఆ తర్వాత అన్నా మరియా టోర్న్(Anna Maria Torv) ను వివాహం చేసుకున్నారు. 32 ఏళ్ల తర్వాత 1999లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 1999లోనే వెండీ డెంగ్ (Wendi Deng )ని పెళ్లిచేసుకుని 2013 వరకు కలిసి ఉన్నారు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత 2016లో జెర్రీ హాల్ (65)ను నాలుగో వివాహం చేసుకున్నారు. ఆమెను పెళ్లాడిన ఆరేళ్లకు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు అయిదోసారి వివాహానికి సిద్ధమయ్యారు. మొదటి మూడు భార్యల ద్వారా అతనికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. రెండో భార్య నుండి విడిపోయిన సందర్భంలో మర్దోక్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైన వాటిల్లో ఒకటి. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తి ఇచ్చారని తెలుస్తోంది. మర్దోక్ న్యూకార్ప్ సీఈవో అండ్ చైర్మన్. ఫోర్బ్స్ జాబితా ప్రకారం అతని సంపద 17 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది.