»Louisville Declaration Of 3rd September As Sanatana Dharma Day In America
Sanatana Dharma: అమెరికాలో సెప్టెంబర్ 3న సనాతన ధర్మం రోజుగా ప్రకటన
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన కామెంట్స్ దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేశాయి. ఈయన కామెంట్లకు అమెరికాలోని లూయిస్ విల్లే పట్టణం సంచలన నిర్ణయం తీసుకుంది.
Louisville Declaration of 3rd September as Sanatana Dharma Day in America
Sanatana Dharma: సనాతన ధర్మం(Sanatana Dharma)పై తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చుతు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలపై దేశమంతా భగ్గుమంది. బీజేపీతో పాటు స్వామీజీలు తీవ్రంగా మండిపడుతున్నారు. అయోధ్య సాధువు పరమహంస ఆచార్య (Paramhans Acharya) మరో అడుగు ముందుకేసి ఏకంగా ఉదయనిధి తలను తానే నరికేస్తానన్నారు. అలాగే అతని తల నరికితే వారికి రూ.10 కోట్లు ఇస్తానని ప్రకటించారు.
ఈ క్రమంలో అమెరికా(America)లోని కెంటకీ (Louisville)లోని లూయిస్ విల్లే (Kentucky)పట్టణం సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 3వ తేదీని సనాతన ధర్మ దినం( September 3 Sanatana Dharma Day)గా ప్రకటించింది. కెంటకీ రాష్ట్రంలోని లూయిస్ విల్లే పట్టణ మేయర్ బార్బరా సెక్స్టన్ స్మిత్ (Barbara Sexton Smith) ఈ విషయంపై మాట్లాడుతూ.. సెప్టెంబర్ 3ని సనాతన ధర్మం రోజుగా ప్రకటించారు. ఇక నుంచి ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 3న లూయిస్ విల్లే పట్టణంలో సనాతన ధర్మానికి మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించనున్నమని తెలిపారు. ఉదయనిధి స్టాలిన్ అలా వ్యాఖ్యలు చేసిన రోజునే సనాతన ధర్మం రోజుగా ప్రకటించడం విశేషం. మేయర్ క్రెయిగ్ గ్రీన్ బెర్గ్ తరఫున డిప్యూటీ మేయర్ బార్బనా సెక్స్ టన్ స్మిత్ దీనిపై అధికారికంగా ప్రకటన చేశారు. పట్టణంలోని హిందూ ఆలయంలో మహా కుంభాభిషేకం కార్యక్రానికి హాజరైన డిప్యూటీ మేయర్ ప్రకటన చదివి వినిపించారు. లూయిస్ విల్లేలోని హిందూ దేవాలయంలో జరిగిన మహా కుంభాభిషేకం వేడుకలో ఈ ప్రకటనను చదివి వినిపించారు. అయితే ఉదయనిదతి చేసిన ఈ వ్యాఖ్యలకు కొంతమంది మద్దతు ఇస్తుంటే మరికొంత మంది మండి పడుతున్నారు.