»Sonia Gandhi Wrote A Letter To Prime Minister Modi Include 9 Demands On Parliament
Sonia Gandhi: ప్రధాని మోడీకి 9 డిమాండ్లతో సోనియా గాంధీ లేఖ
ఈ నెల కేంద్రం ఏర్పాటు చేసిన అత్యవసర ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ప్రధాని మోడీకి 9 డిమాండ్లను చేర్చాలంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు.
Sonia Gandhi wrote a letter to Prime Minister Modi include 9 demands on Parliament.
Sonia Gandhi: మోడీ సర్కార్ ఈ నెల 18 నుంచి 22 వరకు అత్యవసర పార్లమెంట్ సమావేశాలు నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటికే అగ్రనేతలు అందరు స్పందించారు. ఓకే దేశం, ఓకే ఎన్నిక అనే అంశంపై ఆ సమావేశం ఉంటుందని కొందరు అభిప్రాయపడగా.. తాజాగా ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకే ఈ సమావేశం అంటు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల (special Parliament session) ఎజెండా ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)కి లేఖ రాశారు. అలాగే ఈ ప్రత్యేక సమావేశాల ఎజెండాలో 9 అంశాలను చేర్చాలని ఆమె లేఖలో పేర్కొన్నారు.
అదానీ అక్రమాలు, మణిపుర్ అల్లర్లు(Manipur riots,), రైతు సమస్యలు, కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీ, కులాల వారీగా జనగణన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రోజురోజుకీ దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఆదుకోవడం, హరియాణా సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దుల్లో కొనసాగుతున్న చైనా ఆక్రమణలపై చర్చ చేపట్టాలని సోనియా గాంధీ లేఖలో పేర్కొన్నారు. అయితే మోడీ సర్కార్ ప్రణాళిక ఏంటో ఎవరికి అంతు చిక్కడం లేదు. అయితే విపక్షాల కూటిమి పేరు ఇండియా అనిపెట్టుకోవడంతో.. కేంద్రం దేశం పేరు మార్చబోతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మరీ పార్లమెంట్ సమావేశంలో ప్రభుత్వం ఏఏ నిర్ణయాలు తీసుకుంటుందోనని దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.