బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా త్వరలోనే మూడు ముళ్లతో ఒకటి కానున్నారు. ఈ మేరకు వీరి పెళ్లి ముహుర్తం ప్లేస్ కూడా సిద్ధం అయింది. వీరి వివాహానికి ప్రముఖులు హాజరు అవుతుండడంతో భద్రతా సిబ్బంది ఈ పాటికే రంగంలో దిగి ఆ హెటల్లో తనిఖీలు ప్రారంభించింది.
Raghav Chadha, Parineeti Chopra to get married in Udaipur on September 23-24
Parineeti Chopra: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha), బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా( Parineeti Chopra) గత కొంతకాలంగా పెళ్లి చేసుకొబోతున్నారనే వార్త తెలిసిందే. ఈ మేరకు వారి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇక వీరిద్దరు మూడుముళ్ల బంధంతో ఒకటి అవడానికి ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల సెప్టెంబర్ 23, 24 తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వివాహం చేసుకోనున్నారు. ఈ మేరకు లీలా ప్యాలెస్, ది ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో వివాహ వేడుకలు ప్రారంభం అవుతున్నాయి. వీరి మ్యారెజ్ వేడుకకు దాదాపు 200 మంది అతిథులు, 50 మంది వరకు వీవీఐపీలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వాటికి సంబంధించిన ఏర్పాట్లను ఆ హోటల్లలో నిర్వహిస్తున్నారు.
బుకింగ్‌లు ఖరారైన వెంటనే రెండు హోటళ్లలో వివాహ వేడుకల పనులను ప్రారంభించారు. వీరి వివాహానికి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో సహా పలువురు వీఐపీలు హాజరుకానున్నారు. పరిణితి చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ కూడా అటెండ్ కానున్నారు. హోటల్ స్టాఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 23న హల్దీ, మెహందీ, మహిళల సంగీత కచేరి నిర్వహించనున్నారు. ఇక 24న పెళ్లి తరువాత హర్యానాలోని గురుగ్రామ్‌లో రిసెప్షన్ నిర్వహించబడుతుంది. ఎంతో కాలంగా బాలీవుడ్లో ప్రేమపక్షులుగా ఉన్న వీరు పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మే 13న ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఇక ఈ నెల చివరి వారంలో ప్రముఖుల సమక్షంలో ఒకటి కాబోతున్నారు.