»Is Worms Raining In China Video From Beijing Goes Viral
Viral Video: చైనాలో పురుగుల వర్షం
చైనా(China)లో పురుగుల వర్షం(Worms Rain) కురిసింది. చైనా దేశ రాజధాని అయిన బీజింగ్ లో పురుగుల వర్షం కురవడం కలకలం రేపింది. రోడ్డుపై వర్షంతో పాటుగా పురుగులు కూడా పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. పురుగులు తమపై పడకుండా ఉండేందుకు అక్కడున్నవారు గొడుగులు ఉపయోగించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

పురుగుల వర్షాని(Worms Rain)కి గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఆకాశం నుంచి వర్షంతో పాటుగా పెద్ద సంఖ్యలో పురుగులు కూడా పడినట్లు న్యూయార్క్ పోస్టు తెలిపింది. భారీ గాలులకు బురదలోని పురుగులు పైకి కొట్టుకెళ్లి వర్షంతో పాటు పడినట్లుగా అక్కడి ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
చాలా వరకూ తుఫాను తర్వాత వీచే భారీ గాల్లుల్లో పురుగులు, కీటకాలు చిక్కుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని పరిశోధకులు తెలుపుతున్నారు. మరోవైపు పురుగుల వర్షానికి సంబంధించి చైనా మీడియా ఖండించింది. ఈ వారంలో బీజింగ్ లో ఎలాంటి వర్షాలు పడలేదని, అదొక ఫేక్ వార్త(Fake News) అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పురుగుల వర్షాని(Worms Rain)కి సంబంధించిన వీడియో వైరల్(Viral) అవుతోంది.