»Golden Egg The Creature That Lays A Golden Egg Scientists Are Looking For It In The Sea
Golden Egg: ‘బంగారు గుడ్డు’ పెట్టే జీవి..సముద్రంలో వెతుకుతోన్న శాస్త్రవేత్తలు!
సముద్రంలో బంగారు గుడ్డును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ గుడ్డును పెట్టిన జీవి కోసం సముద్రంలో గాలిస్తున్నారు. ఆ వింత గుడ్డును పెట్టిన జంతువు కోసం సముద్రంలో లోతుగా పరిశోధనలు చేస్తున్నారు.
పసిఫిక్ మహాసముద్రం అడుగు భాగంలో శాస్త్రవేత్తలు ఓ ‘బంగారు గుడ్డు’ను కనుగొన్నారు. ఆ గుడ్డును పెట్టిన జీవి కోసం సముద్రంలో గాలిస్తున్నారు. సముద్ర శాస్త్రవేత్తల బృందం ఆ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తోంది. పసిఫిక్ మహా సముద్రంలోని దక్షిణ అలాస్కా (Alaska)తీరంలో ఆగస్టు 30న ఓ వింత వస్తువును శాస్త్రవేత్తల కంటపడింది. గుడ్డు ఆకారంలో ఉండే ఆ వింత వస్తువు బంగారం రంగులో ఉండటంతో వారు ఆశ్చర్యపోయారు. ఆ గుడ్డుకు ఓ వైపు రంధ్రం ఉంది. ప్రస్తుతం ఆ గుడ్డు పెట్టిన జీవి కోసం సముద్రంలో గాలిస్తున్నారు.
అమెరికాకు చెందిన సైంటిస్టులు సీస్కేప్ అలాస్కా (Seascape Alaska) పసిఫిక్ మహా సముద్రంలో యాత్ర చేస్తుండగా ఇది కనిపించింది. దాదాపు రెండు మైళ్ల లోతులో అంతరించిపోయిన అగ్నిపర్వతాన్ని (underwater volcano) అన్వేషించే క్రమంలో ఈ బంగారం రంగులో ఉండే గుడ్డు కనిపించింది. ఆ గుడ్డుకు శాస్త్రవేత్తలు ‘స్పూకీ గోల్డెన్ ఎగ్’ (spooky golden egg)అని పేరు పెట్టారు. ఆ బంగారు గుడ్డును సముద్రంలో జీవించే ఏదో ఒక జీవి పొదిగి ఉండొచ్చని వారు భావించారు.
రిమోట్ నియంత్రిత పరికరాల ద్వారా శాస్త్రవేత్తల బృందం ఆ గుడ్డును సేకరించారు. బంగారు కవచంలో ఆ వింత గుడ్డును గుర్తించారు. ఆ గుడ్డును ఏ జంతువు పెట్టి ఉంటుందనే విషయాన్ని తెలుసుకునేందుకు లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి వింత వస్తువును కనుగొనలేదని, ఆ వస్తువును తాము అస్సలు చూడలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ బంగారు గుడ్డు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వింత గుడ్డుపై అందరికీ క్యూరియాసిటీ పెరగడంతో దీని గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు నెట్టింట శోధిస్తున్నారు.