»Eiffel Tower Temporarily Closing The Eiffel Tower Is The Reason
Eiffel Tower: తాత్కాలికంగా ఈఫిల్ టవర్ మూసివేత.. కారణమిదే!
ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక క్షేత్రమైన ఈఫిల్ టవర్ మూతపడింది. అయితే ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సమ్మెకు దిగడం వల్ల ఈఫిల్ టవర్‌ను అధికారులు మూసివేశారు.
Eiffel Tower: ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక క్షేత్రమైన ఈఫిల్ టవర్ మూతపడింది. సాధారణంగా ఈఫిల్ టవర్ 365 రోజులు తెరిచి ఉంటుంది. అయితే ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సమ్మెకు దిగడం వల్ల ఈఫిల్ టవర్‌ను అధికారులు మూసివేశారు. దీంతో ఈఫిల్ టవర్‌ను చూడటానికి వచ్చిన సందర్శకులను వెనక్కి పంపారు. సీజీటీ యూనియన్‌కు చెందిన ఉద్యోగులు ఈఫిల్ టవర్ నిర్వహణ బాధ్యతలు చూస్తారు. ఈఫిల్ టవర్ టికెట్ల నుంచి వచ్చే ఆదాయానికి అనుగుణంగా తమ జీతాలు పెరగాలని సీజీటీ ఉద్యోగులు సమ్మెలో దిగారు.
ఈఫిల్ టవర్ దగ్గర ఉద్యోగుల సమ్మె కారణంగా మూసివేశామని, దీనికి మన్నించమని బోర్డు పెట్టారు. అలాగే అధికారిక వెబ్సైట్లో కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. త్వరలో జరగనున్న 2024 సమ్మర్ ఒలంపిక్స్‌కు పారిస్ వేదిక కానుండటం వల్ల పర్యటకులు భారీగా ఈఫిల్ టవర్ సందర్శనకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నిర్మాణాన్ని చూసేందుకు ఏటా దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది పర్యటకులు వస్తుంటారు. గతేడాది 62 లక్షల మంది ఈ కట్టడాన్ని సందర్శించినట్లు రికార్డులు చెబుతున్నాయి.