»Tenant Bus Strike In Telangana Disturbance For Rtc Passengers
Bus Strike: ఆర్టీసీ ప్రయాణికులకు షాక్.. రేపటినుంచి బస్సుల సమ్మె
తెలంగాణలో అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దిగనున్నారు. మహాలక్ష్మీ పథకం అమలుతో సామార్థ్యానికి మించి ప్రయాణిలను తరలించడంతో.. బస్సులు పాడవుతున్నాయని యాజమానులు ఆందోళన చెందుతున్నారు.
Tenant bus strike in Telangana..Disturbance for RTC passengers
Bus Strike: తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలుచేయడంతో బస్సుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం ఆనందపడింది. అయితే అద్దె బస్సుల యజమానులు మాత్రం సంతోషంగా లేరని తెలుస్తుంది. ప్రయాణికుల రద్దీ పెరగడం, సామార్థ్యానికి మించి ప్రయాణిలను తరలించడంతో బస్సులు పాడవుతున్నాయని యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఒక ట్రిప్లో ఎక్కువ మంది ప్రయాణించడం వలన బస్సు కేఎంపీఎల్ పడిపోయిందని, దీంతో బస్సుల నిర్వహణ భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు.
వారి సమస్యలు పరిష్కరించకుంటే జనవరి 5 నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వారి డిమాండ్లను పట్టించుకోకపోవడంతో రేపటి నుంచి సమ్మెకు వెళ్లాలని వారు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,700 బస్సులు నడుస్తుండగా, హైదరాబాద్లోనే 300 బస్సులు రన్నింగ్లో ఉన్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా రోజుకు సగటున 30 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. ఒక వేళ అద్దె బస్సుల యాజమాన్యం సమ్మె చేస్తే చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.