సలార్ పార్ట్ 1 సీజన్ ఫైర్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే 650 కోట్ల గ్రాస్ మార్క్ దాటిపోయింది. దీంతో సలార్ 2 అప్డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. తాజాగా సలార్ 2 పై బిగ్ అప్డేట్ ఇచ్చారు.
Salaar 2: సలార్ సినిమాలో ప్రభాస్ కటౌట్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. దీంతో సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఫస్ట్ పార్ట్‌లో చూపించింది శాంపిల్ మాత్రమే.. అసలు కథ పార్ట్ 2లో ఉంటుందని.. కథ మధ్యలోనే కట్ చేశాడు ప్రశాంత్ నీల్. సలార్ పార్ట్ 2.. శౌర్యాంగ పర్వం పేరుతో రాబోతోంది. అయితే.. సలార్ 2ఎప్పుడుంటుందనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు సీక్వెల్ పై క్లారిటీ వచ్చేసింది. నిర్మాత విజయ్ కిరగందూర్ స్వయంగా తనే సలార్ 2 షూటింగ్ ఈ ఏడాదిలోనే ఉంటుందని తెలిపాడు.
సలార్ 2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది.. షూటింగ్ ఎప్పుడైనా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రభాస్, ప్రశాంత్ కూడా వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. వచ్చే 15 నుంచి 18 నెలల్లో సలార్ 2ను పూర్తి చేయాలని చర్చలు జరుగుతున్నాయి. 2025లో ఎట్టి పరిస్థితుల్లో సలార్ 2ను విడుదల చేస్తాం.. పార్ట్ 2 మరింత భారీస్థాయిలో ఉంటుంది. డ్రామా, రాజకీయాలు, యాక్షన్ అన్నీ కలిపి సలార్ 2 ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లాగా ఉంటుందని.. స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే.. నిర్మాత లాగే ప్రభాస్ కూడా సలార్ 2 అప్టేడ్ ఇచ్చాడు.
‘కథ ఇప్పటికే సిద్ధంగా ఉంది.. వీలైనంత త్వరగా సలార్2 ప్రేక్షకుల ముందుకు వచ్చేలా చేస్తాం. దాని కోసం నా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. పార్ట్ 2 వివరాలను త్వరలో వెల్లడిస్తాము.. అని ప్రభాస్ తెలిపాడు. దీంతో సలార్ మూవీ 2025 మిడ్‌లో రావడం పక్కా అని చెప్పొచ్చు. మరి అఫిషీయల్ అనౌన్స్మెంట్ ఎప్పుడుంటుందో చూడాలి.