Do you know which phone Facebook founder Mark Zuckerberg uses?
Mark Zuckerberg: సాధారణంగానే సెలబ్రిటీలు, ప్రముఖ కంపెనీల సీఈవోలు ఉపయోగించే వస్తువులు, బట్టలు చివరికి చెప్పుల గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అంతే కాదు దానికి సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేస్తుంటారు. అలా ఏదైన అంశం వెలుగులోకి వస్తే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మాములుగా అయితే సినిమా సెలబ్రెటీల విషయాలు సులువుగా తెలుస్తుంటాయి. కానీ పాపులర్ సంస్థలకు సంబంధించిన సీఈవోల గురించి అరుదుగా బయటకు వస్తాయి. గతంలో యాపిల్ (Apple) సీఈవో టిమ్ కుక్ (Tim Cook) వాడే ఫోన్ గురించి పెద్ద చర్చే జరిగింది. చివరకు ఆయన ఐఫోన్ (iPhone) వాడతారని తెలిసింది. వేరే కంపెనీ మొబైల్ వాడుతారని అప్పట్లో చర్చ జరిగింది. ఇక గూగుల్ (Google) సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) సైతం పిక్సెల్ (Pixel) ఫోన్ ఉపయోగిస్తానని గతంలో చెప్పారు. తాజాగా మెటా (Meta) సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) ఫోన్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన చెకింగ్ 13 మెయిల్స్ ఆన్ ది వే టూ ది కన్సర్ట్ అంటూ ఇన్‌స్టా స్టోరీలో మొబైల్ చూస్తున్న ఫొటో షేర్ చేశారు. దీంతో ఆయన ఏం ఫోన్ వాడుతున్నారనే చర్చ మొదలయింది. అయితే అతను ఆండ్రాయిడ్ మోడల్ శాంసంగ్ ఫోన్‌ను వాడుతున్నట్లు తెలుస్తుంది. అది కచ్చితంగా ఏ మోడల్ అనే దానిపై స్పష్టత లేదు. డిజైన్ పరంగా అది శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్ లేదా ఎస్ 22 సిరీస్ మోడల్ అని నెటిజన్లు భావిస్తున్నారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జుకర్ బర్గ్ తనకు ఆండ్రాయిడ్ ఫోన్ అంటే ఎంతో ఇష్టమని, చాలా కాలంగా శాంసంగ్ ఫోన్లనే ఉపయోగిస్తున్నానని చెప్పారు. ఆ బ్రాండ్‌కు తాను పెద్ద ఫ్యాన్ అని వెల్లడించారు. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆండ్రాయిడ్ ఫోన్లే ఎక్కువగా యూజ్ చేస్తున్నారని జుకర్ అభిప్రాయపడ్డారు. అంతే కాదు తన కంపెనీలోని ఉద్యోగులకు కూడా ఎక్కువగా ఆండ్రాయిడ్ మొబైల్స్‌నే వాడమని సలహా ఇస్తనని చెప్పారు.